Wednesday, April 24, 2024

వేతన సవరణ నిర్ణయం ఉపసంహరణ

- Advertisement -
- Advertisement -

TS Govt withdraws its decision to increase salaries of local body leaders

కోడ్ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

ఎంఎల్‌సి ఎన్నికల నియమావళి నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం

మనతెలంగాణ/హైదరాబాద్: పట్టణ ప్రాంత స్థానిక ప్రజాప్రతినిధుల వేతనా ల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మేయర్లు, చైర్‌పర్సన్లు, డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యుల గౌరవ వేతనాలు 30 శాతం పెంచుతూ పురపాలకశాఖ గురువారం (నవంబర్ 18) ఉత్తర్వులు జారీచేసింది. జూలై నెల నుంచి గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు అందులో పేర్కొంది. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించు కుంటూ ప్రభుత్వం జిఓ 201 ద్వారా శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి ఎన్నికల నియమావళి నేపథ్యంలో ఈ నిర్ణ యాన్ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అయితే గౌరవ వేతనాల పెం చేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News