Thursday, April 25, 2024

ఎంఎల్‌సి ఓటర్ల జాబితా షెడ్యూల్

- Advertisement -
- Advertisement -

అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు నమోదు ప్రక్రియ
డిసెంబర్ 1న ముసాయిదా
జనవరి 1న ఫైనల్‌లిస్ట్

GHMC Election 2020 Works starts in Hyderabad

మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 29తో ఖాళీ కానున్న పట్టభద్రుల కోటా ఎంఎల్‌సి ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటికి ఎస్.రామచందర్‌రావు, పల్లారాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్య వహిస్తున్నారు. ఈ స్థానాలు ఖాళీ అవుతున్నందున సంబంధిత నియోజకవర్గాల ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఓటర్ల జాబితా తయారీ కోసం అక్టోబర్ ఒకటో తేదీన బహిరంగ నోటీసు ఇస్తారు. ఓటరు నమోదు కోసం దరఖాస్తులకు నవంబర్ 6 వరకు గడవు ఇచ్చారు. అఆగే డిసెంబర్ ఒకటో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురిస్తారు. దీనిపై డిసెంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నారు. వీటన్నింటిని పరిష్కరించి జనవరి ఒకటో తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు.
అప్పుడే వ్యూహాలు రచిస్తున్న రాజకీయ పార్టీలు
రాష్ట్రంలో ఖాళీ అవుతున్న పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాలపై అప్పుడే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. అధికార పార్టీ అన్ని రకాలుగా సమర్థులైన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చేదానిపై కూడా సిఎం కెసిఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిసింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ఇప్పటికే కసరత్తును ప్రారంభించింది. ఆశావాహులు అధిష్టానం నుంచి హామీ తీసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం కూడా ఈ ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పక్షాల మద్ధతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. బిజెపి కూడా బలమైన అభ్యర్థులను బరిలో నిలపడం ద్వారా గెలుపును సొంత చేసుకోవాలని భావిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్న తరువాత వస్తున్న మొదటి ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా మారింది. అదే సమయంలో వామపక్ష పార్టీ అయిన సిపిఐ అధికార పార్టీకి మద్ధతు ఇచ్చే సూచనలు ఉన్నట్లు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల స్థానం సులభంగా టిఆర్‌ఎస్ ఖాతాలో పడుతుందని అంచనా వేస్తున్నారు.

 

TS Graduate MLC Voter Registration Process Starts from Oct

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News