Home తాజా వార్తలు దేశంలోనే నెం.1 తెలంగాణ గురుకుల స్కూళ్లు…

దేశంలోనే నెం.1 తెలంగాణ గురుకుల స్కూళ్లు…

Gurukul-Schoolsహైదరాబాద్:  తెలంగాణ గురుకుల పాఠశాల(సాంఘీక సంక్షేమ)లు విద్యా ప్రమాణాల విషయంలో దేశంలోనే నెం.1 స్ధానంలో నిలిచాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య అన్నారు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల్లో గురుకులాల విద్యార్ధులు 10/10 జీపీఏ సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. శనివారం ఆయన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. సాంఘీక సంక్షేమ పాఠశాలలు విద్యార్ధులకు విద్యతో ఆపటు క్రీడలు, సాహస కృత్యాలను అలవర్చడంతో ముందంజలో నిలుస్తున్నాయని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు సవాల్ విసిరినట్టు అయిందన్నారు.

అందుకు కృషి చేసిన ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌పై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రవీణ్ కుమార్ తన స్వయానుభవంతో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు నేటి విద్యార్ధులు ఎదుర్కొవద్దన్న ఉద్దేశ్యంతోనే సంక్షేమ పాఠశాలలను సరస్వతి క్షేత్రాలుగా మార్చారని చెప్పారు. ఫలితంగా తెలంగాణలోని గురుకుల పాఠశాలలో ప్రవేశం దొరికే చాలనుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అలాంటి వ్యక్తిపై కర్నె శ్రీశైలం నిందారోపణలు చేయడం తగదన్నారు. బురదచల్లే ప్రయత్నం చేస్తే.. వారిని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హెచ్. భగవాన్ దాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు షామ్, విద్యార్ధి నాయకులు జి. సుధాకర్, జీ. కేశవులు తదితరులు పాల్గొన్నారు.

TS Gurukul Schools No 1 in Telangana