Friday, April 26, 2024

అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యశాఖ అలర్ట్

- Advertisement -
- Advertisement -

TS Health Department Alert on seasonal diseases

హైదరాబాద్: నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమై వరద ముప్ప ప్రాంతాల్లో ఆరోగ్య శిభిరాలు ఏర్పాటు చేశారు. నీరు కలుషితం కావడంతో వాంతులు, విరేచనాలతో పాటు, డెంగ్యూ,మలేరియా వంటి విషజ్వరాలు వచ్చే ప్రమాదముందని ముందస్తు జాగ్రత్తలో భాగంగా బస్తీ,కాలనీ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా ప్రభావం ఉండటంతో వర్షాలకు విజృంభించే అవకాశ ముందని అధికారులు జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి కరోనా టెస్టులు చేస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 06 జోన్లలోని 30 సర్కిళల్లో పలు కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

వ్యాధులను అరికట్టేందుకు 70 ప్రాంతాల్లో ఆరోగ్యశిబిరాలు ఏర్పాటు చేసి,వైద్యసిబ్బంది అక్కడికి వెళ్లి చికిత్సలు చేస్తున్నారు. జ్వరం లక్షణాలున్న తీవ్రంగా ఉన్నవారిని ఉస్మానియా,గాంధీ ఆసుపత్రులకు తరలించేందుకు క్యాంప్ వెంట 104 అంబులెన్సు సిద్దం చేసుకున్నారు.పట్టణ ఆరోగ్య కేంద్రాలు,బస్తీదవఖానలు 24గంటలు పాటు తెరిచి ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.వరద ప్రాంతాల్లో స్దానిక వైద్యులు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. నీట మునిగిన ప్రాంతాల్లో రాకపోకలు సజావుగా లేనందున స్దానిక ఆసుపత్రులు తగినంతగా ఆక్సిజన్ నిల్వలు ఉంచుకోవాలని, అదే విధంగా విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకుని,అవసరమైతే జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మందులు,రక్తపరీక్షలకు సంబంధించిన కిట్లు,సిరంజిలు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి వైద్యాధికారులు సూచనలు చేస్తున్నారు. వర్షాల కారణంగా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు పేర్కొంటూ అంటు వ్యాధులుకు కారణం నీరు కలుషితమైతుందని, వీలైనంత వరకు కాచి చలార్చి తాగడం, బాగా ఫిల్టర్ చేసిన నీళ్లను తాగాలి.

మంచినీరు ఎక్కువ రోజుల నిల్వ ఉంచుకోవద్దని, బయట వండిన ఆహార పదార్దాలు తినకూడదని, ఎప్పటికప్పడు వండుకుని,వేడి ఉండగానే తినాలి. మాంసాహారం కంటే శాకాహరానికి ప్రాధాన్యత ఇవ్వాలి, మాంసహారంతో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని,వాన నీరు రోడ్లపై నిలిచి ఉంటుంది, దీంతో దోమలు వ్యాప్తి చెంది మలేరియా ,డెంగ్యూ వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో చెత్తవేసుకునే కుండీలను దూరంగా పెట్టుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి, మల,మూత్ర విసర్జనకు ముందు,తరువాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుకోవాలి.ఇన్ఫెక్షకన్లతో బాధపడేవారు. వానలో ఎక్కువగా తడిస్తే నిమోనియా వంటి సెకండరీ ఇన్పెక్షన్లు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.సాధ్యమైనంతవరకు తల తడవకుండా చూడాలని సూచించారు.

TS Health Department Alert on seasonal diseases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News