Friday, April 26, 2024

700 మంది విద్యార్థినులకు ఒక్కటే మూత్రశాలనా?: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతుల కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలపై ఎల్‌ఎల్‌బి విద్యార్థి మణిదీప్ రాసిన లేఖను సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది.

700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే ప్రభుత్వ విద్యాసంస్థల్లో బాలికలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించింది. ఈమేరకు సిఎస్, విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్ బోర్డు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 25లోగా విద్యాసంస్థల్లోని వసతులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News