Home తాజా వార్తలు 12న ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు..?

12న ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు..?

 TS Inter 2nd year will be released on June 12

 

హైదరాబాద్ : ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈ నెల 12వ తేదీన విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయాలని ఇదివరకే భావించినా అది సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ముందుగా ఈ నెల 12 లేదా 13వ తేదీన ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేసి ఆ తరువాత రెండు మూడు రోజుల్లో మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల చేయనుంది. మొత్తానికి జూన్ 15వ తేదీలోగానే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఫలితాలు వచ్చాక నెల రోజుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. వార్షిక పరీక్షలకు హాజరైన వారిలో 30 శాతం మంది వీటికి హాజరు కానున్నారు. గత ఏడాది ఇంటర్ ఫలితాలలో తప్పులు దొర్లిన నేపథ్యంలో ఈ సారి ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాతనే ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించారు. ఇంటర్ ఫలితాలలో ఎలాంటి సాంకేతికపరమైన తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఇంటర్ ఫలితాల ప్రక్రియ పూర్తయి ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాతనే ఫలితాలు వెల్లడించే తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.

TS Inter 2nd year will be released on June 12