Home తాజా వార్తలు వారంలో తొలి జెఇఇ మెయిన్స్ ఫలితాలు

వారంలో తొలి జెఇఇ మెయిన్స్ ఫలితాలు

TS JEE Main result is announced within a week

 

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జరిగిన తొలి జెఇఇ మెయి న్ పరీక్ష ఫలితాలు వారంలో విడుదల కానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జెఇఇ మెయిన్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సం బంధించి త్వరలో ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తర్వాత తుది కీ విడుదల చేసి వెంటనే స్కోర్ విడుదల చేయనున్నారు. ఐఐటి, ఎన్‌ఐటిల్లో బి.టెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జరిగే పేపర్ 1 పరీక్షకు 6,52,490 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, వారిలో 6,20,153 మంది హాజరయ్యారు. పేపర్ 1 రెండవ విడత పరీక్షలు మార్చి 15,16,17,18 తేదీల్లో జరుగనున్నాయి. దాంతోపాటు మరో రెండు సార్లు ఏప్రిల్, మే నెలల్లోనూ జెఇఇ మెయిన్ జరుగనున్నాయి.

TS JEE Main result is announced within a week