Wednesday, November 30, 2022

ధాన్యం దయలేని ఎఫ్‌సిఐ దైన్యం

- Advertisement -

TS not to set up paddy procurement centres in yasangi

 

ఇటు కల్లాల్లో ధాన్యం.. అటు మిల్లుల వద్ద బియ్యం
ఎఫ్‌సిఐ గోడౌన్లు ఖాళీ కాకపోవడంతో ఎక్కడ బియ్యం, ధాన్యం నిల్వలు అక్కడే
యాసంగి సేకరణపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడం రైతులకు గోరుచుట్టుపై రోకలిపోటు వంటి పరిస్థితి

మనతెలంగాణ/హైదరాబాద్: ఒకవైపు వరి ధాన్యం మరోవైపు బియ్యం నిల్వలు రాష్ట్రంలో పేరుకుపోయి ఉన్నాయి. గోదాములు ఖాళీ చేయకుండా రవాణా సౌకర్యం కల్పించకుండా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) సహాయ నిరాకరణ చేయడంతో రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. దీంతో రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. పండిన ధ్యానాన్ని ఎవరైనా కొనుగోలు చేస్తారా? అని దీనంగా నిరీక్షించాల్సిన దుస్తితి నెలకొంది. మరో వైపు బియ్యం పరిస్థితి కూడా అలాగే ఉంది. కేంద్రం సరైన రవాణా సౌకర్యం కల్పించలేకపోతున్నది. దీంతో మిల్లర్ల వద్దనే బియ్యం కుప్పలు తెప్పలుగా నిల్వ ఉంటుంది. వాస్తవానికి రైల్వే వ్యాగన్ల వద్దకు తీసుకొచ్చిన బియ్యాన్ని కేంద్రం ఇతర ప్రాంతాలకు రవాణా చేయాల్సి ఉంటుంది. కానీ ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పుకోవడంతో రైతుల పరిస్థితి ముందు నుయ్యి… వెనుకగొయ్యి అన్న చందంగా మారింది. మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయాలేని పరిస్థితిని ఎదుర్కొంటుండగా…. అతి కష్టం మీద మార్కెట్‌కు బియ్యాన్ని తీసుకొస్తే… సరైన రవాణా సౌకర్యం లభించడం లేదు.

ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇదే అంశంపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కేంద్రానికి విజ్ఞప్తి చేసినా…ఎటువంటి స్పందన రావడం లేదు. దీంతో బియ్యం నిల్వలు కూడా ఎక్కడికక్కడే పేరుకపోతున్నాయి. రైల్వే వ్యాగన్ల వద్ద లారీలు వద్ద రోజుల తరబడి నిలిచిపోతున్నాయి. రోజుకు 64 వ్యాగన్ల మేర రవాణా సౌకర్యం కల్పించాల్సిన కేంద్రం నాలుగు వ్యాగన్లనే కల్పిస్తోంది. దీంతో పండి న ధాన్యాన్ని వ్యాగన్ల వద్దకు తీసుకొచ్చి… వాటి దగ్గరే రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని చూసి రైతుల గుండెలు గొళ్లుమంటున్నాయి. కేంద్ర అలసత్వం కారణంగా రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటల పరిస్థితిని చూసి తీవ్ర మనోవ్యధకు గురవుతున్నారు. పంటలను చూసి మురిసిపోవాల్సిన రైతులు… ప్రస్తుతం దిగాలుపడుతున్నారు. కుప్పలు, తెప్పలుగా పండించిన ధాన్యాన్ని ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు పంటలు చేతికి ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూసిన రైతన్నలు… ఇప్పుడు పండించిన పంటను ఎక్కడకు తీసుకెళ్లాలనే దిగులతో కుమిలిపోతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిది లేదని కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క ప్రకటన వారి ఆశలు పూర్తిగా నీరుగారిపోయాయి. భవిష్యత్తుపై నిలినీడలు కమ్ముకున్నాయి.

ఈ పరిస్థితి నుంచి బయటపడతామా? లేదా? అన్న సందిగ్ధ పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గత ఏడాది 94 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్న కేంద్రం ఇప్పుడు కొర్రీలు పెడుతోంది. ప్రస్తుత సంవత్సరం కేవలం 19 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. కనీసం గత ఏడాది తీసుకున్నంత ధాన్యాన్ని కూడా ఈ సారి తీసుకుంటుందా? అన్నది అనుమానంగా మారింది. రాష్ట్రంలో యాసంగిలో వచ్చే దొడ్డు వడ్లన్నీ బియ్యంగా మార్చాలంటే బాయిల్డ్ చేయాల్సి ఉంటుంది. అదే వర్షాకాలంలో వచ్చే పంటను నేరుగా బియ్యంగా (రా రైస్) మార్చేందుకు అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో యాసంగిలో రా రైస్ రావడం చాలా కష్టం. రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల ఇది సాధ్యం కాదన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాసంగి పంట నేరుగా బియ్యంగా మారిస్తే విరిగి పోతుంది. బాయిల్డ్ చేసి ఆరబెట్టి మరపట్టిస్తేనే బియ్యంగా మార్చే వీలుంటుంది. బాయిల్డ్ చేయకుండా.. రా రైస్ చేస్తే యాసంగి పంటలో క్వింటాల్ వడ్లకు కనీసం 40 కిలోల బియ్యం కూడా రావు. ఇది రైతులకు తీరని నష్టం కలుగుతుంది. కానీ నిబంధనల ప్రకారం క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల బియ్యం ఎఫ్‌సిఐకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీకి దారితీసింది.

ఇలాంటి పరిస్థితుల్లో బాయిల్డ్ రైసు కొనమిని కేంద్రం చెబితే.. యాసంగిలో రైతులు పండించిన పంటనంతా ఎక్కడ దాచుకోవాలని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రశ్నించింది. అయినప్పటికీ కేంద్రం నుంచి తగు సమాధానం రాలేదు. కోటి 45 లక్షల టన్నుల దిగుబడి ఈ వానాకాలంలో రాబోతుంటే.. కేవలం కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నులే కొంటామని అసంబదంగా చెబుతోందని రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. వాస్తవానికి రాష్ట్రాల్లో పిడిఎస్ అవసరాలకు వాడుకోగా మిగిలిన బియ్యాన్ని కొంటామని కేంద్రం గత ఏడాది సెప్టెంబర్ 17న రాష్ట్రాలతో ఒప్పందం కూడా చేసుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం మన దగ్గర 2019…20-20 యాసంగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కాగా 2020…20-21 యాసంగిలో 92.32లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైసు మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఎంఒయు ప్రకారం బియాన్ని కేంద్రం తీసుకోవాలి…కానీ అలా చేయడం లేదు. పైగా రాష్ట్రాల్లో పండిస్తున్న పంటనంతా గోదాముల్లో నిల్వచేసే సామార్థ్యం ఏ రాష్ట్రానికి లేదు. అది కేవలం ఎఫ్‌సిఐకే ఆ సామర్ధం ఉంది. 2001..20-02 సంవత్సరంలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రం దగ్గర సర్ ప్లస్ ఉన్నప్పటికీ.. కొనుగోలు చేశారు.

ఇప్పుడు కూడా అలాగే కొనాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే…కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు తరలించేందుకు లారీలు కూడా రావడం లేదు. అయితే కేంద్రం వద్ద ఐదేళ్లకు సరిపడా బాయిల్ రైసు ఉన్నాయి కాబట్టి.. కేవంల 25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటామంటోంది. యాసంగి పంటకు సంబంధించి 92 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లుల్లో ఉంది, వీటిని బాయిల్ చేసి బియ్యంగా మారిస్తే 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయి. మరి ఈ బియ్యం అంతా ఎక్కడ పెట్టమంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ కొత్తగా వచ్చే పంటను ఎక్కడ పెట్టమంటారు? ఇలా అయితే మనదగ్గరున్న మిగతా 37 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు కొంటారు? అని వారు నిలదీస్తున్నారు. . ఇప్పుడు వానాకాలం మరో 55 లక్షల ఎకరాల్లో వరి పంటతో కోటి 45 మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికి రానుంది. అయితే కేంద్రం60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటామని, 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీ ఇష్టమని చెబుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి 60 లక్షల టన్నుల ధాన్యం, 40 లక్షల టన్నుల బియ్యం సేకరించాలనే నిర్ణ యం తీసుకున్నామని..రాష్ట్రాల చర్చలు జరిపిన తర్వా తే..నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కేంద్రం తెలిపింది.

రబీ సీజన్ ఇంకా ప్రారంభం కాలేదని, ధాన్యం సేకరణపై రాష్ట్రాలతో తాము చర్చించాల్సి ఉందనీ, వచ్చే ఏడాదిలో బియ్యం ఎంత సేకరించాలో నిర్ణయిస్తామనే విషయాన్ని వెల్లడించింది. అయితే..ఒక్కో రాష్ట్రం డిమాండ్ ఒక్కో విధంగా ఉందని,గత నిర్ణయాల ప్రకారమేఇప్పటి వరకు బాయిల్డ్ రైస్ సేకరిచండం జరిగిందని తెలిపింది. సాధారణంగా యాసంగిలో బాయిల్ రైస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వీటికి అధికంగా డిమాం డ్ ఉండటంతో ఈ బియ్యాన్ని రాష్ట్రం నుంచి సేకరించి ఆయా రాష్ట్రాలకు సరఫరా చేసేది. అయితే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లోనే పంటల దిగుబడి పెరిగి బాయిల్ రైస్ ఉత్పత్తి పెరిగింది. ఈ నేపథ్యంలో తమకున్న డిమాండ్ మేరకు రా రైస్ (ముడి బియ్యం) మాత్రమే కావాలని, బాయిల్ రైస్ తీసుకోవద్దని నిర్ణయించింది. అయితే తర్వాత ఎఫ్‌సిఐ 50 శాతం మేర మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ సీజన్‌లో మాత్రం 80 శాతం బాయిల్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవడానికి అంగీకరించింది. ఇదిలా ఉండగా కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకునేందుకు మిల్లర్లు ఆసక్తి కనబర్చడం లేదు.

Telangana not to set up paddy procurement centres in yasangi

Related Articles

- Advertisement -

Latest Articles