Friday, April 19, 2024

వసూళ్లు భేష్

- Advertisement -
- Advertisement -

లాక్‌డౌన్ ప్రభావం నుంచి బయటపడి రికార్డు స్థాయికి చేరుకున్న రాష్ట్ర పన్నుల వసూళ్లు
గత ఏడాది మార్చిలో జిఎస్‌టి రాబడులు రూ.2614కోట్లు
ఈ ఏడాది మార్చి ఆదాయం రూ.3230.03 కోట్లు, 24%వృద్ధి


మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోవిడ్.. లాక్ డౌన్ ప్రభావాలనుంచి బయటపడి రికార్డు స్ధాయిలో పన్నుల వసూళ్ల ను సాధించింది. జీఎస్టీ రాబడుల్లో గత మార్చితో పోలిస్తే భారీ వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మార్చిలో జీఎస్టీ రాబడులు రూ.261 4కోట్లు రాగా, ఈ ఏడాది మార్చిలో రూ.3,230.03కోట్లతో ఏకంగా 24శాతం వృద్ధిని నమోదు చేసినట్లు వాణిజ్యపన్నుల శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మార్చినెల ఆర్ధిక శాఖకు బాగా అనుకూలించింది.ఈ నెల్లోనే భారీగా పన్నుల వసూళ్లు సాధ్యపడ్డాయి.గత ఏడాది మార్చిలో వచ్చిన రూ.5017కోట్ల రాబడితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో రికార్డు స్థాయిలో 31.22శాతం వృద్ధి నమోదు సాధ్యపడింది. మొత్తం రూ.6583.24కోట్లు వసూలైనట్లు వాణిజ్యపన్నుల శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ మార్చిలో రాష్ట్రమంతటా పెట్రోల్, డీజిల్ తదితర ఇంధన అమ్మకాలపైన వ్యాట్ రాబడిలో అంతకు ముందు మార్చిలో వచ్చిన రూ.1523కోట్లతో పోలిస్తే భారీగా 38శాతం తరుగుదల నమోదై కేవలం రూ.943.58కోట్లే వచ్చిం ది. అదే మద్యం అమ్మకాలపైన వ్యాట్ రాబడుల్లో గత మార్చిలో రూ.880కోట్ల రాబడిని సాధించగా, ఈ సంవత్సరం ఏకంగా 36శాతం వృద్ధిని నమోదు చేస రూ.1200కోట్ల రాబడిని సాధించింది. జీఎస్టీ రాబడుల్లో పెరుగుదల రాష్ట్ర ఖజానాను బాగా ఆదుకోగలిగింది. గత ఏడాది ఆర్ధిక సంవత్సరం చివరి నెలలో రూ.3,230.03కోట్లు వసూలు పెద్ద ఊరటనిచ్చింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో వచ్చిన రాబడులతో పోలిస్తే 202021ఆర్ధిక సంవత్సరం సగటున 10శాతం వృద్ధి సాధించినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో వర్తక వాణిజ్యరంగాలు తిరిగి పుంజుకోవటం, పారిశ్రామిక రగం కోలుకోవటం తదితర కారణాలు కూడా పన్నుల వసూళ్లపై పెట్టుకున్న లక్ష్యాల సాధానకు బాగా దోహదపడ్డాయి. లాక్ డౌన్ సడలింపులతో అన్ని రంగాల కార్యక్రమాలు సాఫీగా సాగుతుండటం, పన్నుల వసూళ్లలో వృద్ధికి ఊపునిచ్చింది.

TS registers 24% growth in GST collection in March

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News