Home తాజా వార్తలు కొనసాగుతున్న తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు..

కొనసాగుతున్న తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు..

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆర్ఆండ్ బీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సచివాలయ కూల్చివేత పనులను  డిజిపి మహేందర్ రెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సీ బ్లాక్ కూల్చివేత 50శాతం, రాక్ స్టోన్ బిల్డింగ్ 80శాతం పూర్తి అయ్యింది. డీ బ్లాక్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. దీంతో సచివాలయానికి వెళ్లే దారులన్నీ మూసివేశారు. సచివాలయం నుంచి కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ఐమాక్స్, రవీంద్ర భారతీ, లక్డీకపూల్, హిమాయత్ నగర్, బషీర్ భాగ్ వద్ద వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారిమళ్లిస్తున్నారు. కాగా, పాత సచివాలయం కూల్చివేత దృష్ట్యా బీఆర్కేఆర్ భవనంలో అన్ని కార్యాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పాత సచివాలయం స్థానంలోనే కొత్త సచివాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, తెలంగాణ కొత్త సచివాలయం డిజైన్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే సిఎం కెసిఆర్ డిజైన్ కు ఆమోద తెలపనున్నారు.

TS Secretariat Building demolition work begins