Friday, April 19, 2024

నేడు పది పరీక్షల షెడ్యూల్?

- Advertisement -
- Advertisement -

SSC Exam

హైదరాబాద్ : పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ శుక్రవారం ఖరారయ్యే అవకాశం ఉంది. జూన్ 8వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ప్రతిపాదించిన ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే పరీక్షల తేదీలను వెల్లడించనున్నారు. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేయనున్నారు. రెండు రోజుల ఒక పరీక్ష చొప్పున జూలై 2వ తేదీ వరకు పరీక్షలు కొనసాగించేలా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం. ఆదివారం సెలవు దినంగా పరిగణనలోకి తీసుకోవడంతో కొన్ని పరీక్షలకు మూడు రోజుల వ్యవధి వస్తోంది.

కరోనా కారణంగా మార్చి 19వ తేదీన ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలను హైకోర్టు నిలిపివేసింది. మొత్తం 11 పరీక్షలకు గాను అప్పటికి మూడు మాత్రమే పూర్తయ్యాయి. గతంలో మాదిరిగా కాకుండా పరీక్షలు జరుగుతుండగానే పూర్తయిన సబ్జెక్టుల మూల్యాంకనం మొదలు పెట్టేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత పది జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలు జరుతుండగానే మూల్యాంకనం చేపడితే రెండు వారాల్లో పూర్తవుతుంది. అంటే జూలై 25 నాటికి ఫలితాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News