Home తాజా వార్తలు కరోనా కట్టడికి నియోజకవర్గ అభివృద్ధి నిధులు విరాళం

కరోనా కట్టడికి నియోజకవర్గ అభివృద్ధి నిధులు విరాళం

MLA Macha Nageswara Rao

 

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట టిడిపి ఎంఎల్‌ఎ మచ్చె నాగేశ్వరావు నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించిన నిధులు రూ. 3 కోట్లు కరోనా కట్టడి కోసం సిఎం సహాయ నిధికి ఇచ్చారు. తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్. రమణ ప్రధాన మంత్రి ప్రత్యేక కరోనా సహాయ నిధికి రూ. ఒక లక్ష తనవంతు సహాయంగా ఇచ్చారు. ఆదివారం టిడిపి 38 ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మాజీ సిఎం చంద్రబాబు నాయుడు, ఇతర పార్టీ ముఖ్యనాయకులు వారున్న ప్రాంతాల్లోనే దివంగత నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూల మాలా వేసి శ్రద్ధాంజలి ఘటించారు. టెలికాన్ఫరెన్స్‌లోనే టిడిపి 39వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… బాధితులను ఆదుకోవడమే ఎన్‌టిఆర్ సిద్దాంతమన్నారు. దివిసీమ తుఫాన్‌లో, రాయలసీమ క్షామంలో ఎన్‌టిఆర్ సేవలే స్పూర్తిగా తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిలోనూ ప్రజలను అదే స్ఫూర్తితో ఆదుకోవాలని సూచించారు. అన్నివర్గాల ప్రజల్లో ధైర్యం పెంచడంతో పాటు ఆత్మవిశ్వాసం నింపాలన్నారు. సమాజంలో ఏ వర్గం వివక్షకు గురికారాదని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్. రమణ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ప్రతిఒక్కరికి అవకాశాలు రావాలన్నారు. ఆయా వర్గాల వాళ్లు తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలన్నదే ఎన్‌టిఆర్ ఆశయమన్నారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, ముస్లిం, మైనారిటి ప్రజల హక్కులు, రాజ్యాధికారంలో వాటా కోసం ఎనలేని కృషి చేశారన్నారు.

TS TDP MLA RS. 3 Crore Donation to CMRF