Friday, March 29, 2024

ప్రగతి పథంలో టిఎస్‌ గిరిజన కార్పొరేషన్

- Advertisement -
- Advertisement -

TS Tribal Corporation

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ ప్రగతి పథంలో నడుస్తుంది. నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రతి ఏటా ప్రగతి సాధిస్తుంది. ఈ మేరకు టిఎస్ గిరిజన కార్పొరేషన్ ప్రగతి పై బిఆర్‌కే భవన్‌లో ముఖ్యకార్యదర్శి మహెష్ దత్ ఎక్కా అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ ఏడాదిగా నిర్దేశించిన లక్ష్యాలు, ప్రగతి సాధించిన తీరు తెన్నులను చర్చించారు.

ఈ మేరకు 2020-2021 ఏడాది లక్ష్యాల సాధనకు ప్రణాళిక బద్దంగా వ్యవహారించాలని అధికారులను అదేశించారు. రాష్ట్ర విభజన తర్వాత టిఎస్‌జిసిసి గ్రామీణ పారిశ్రామిక ప్రగతి పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌ఎఇపితో ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలోని గిరిజన యువతను ప్రోత్సహించే విధంగా నూతన కార్యాచరణ ద్వారా ఆశించిన ప్రగతి సాధించారు. అలాగే భద్రచాలం, ఉట్నూరు, ఎటూరు నాగారం పరిధిలో గిరిజన సంఘాలను ఏర్పాటు చేశారు.

గిరిజనుల అభ్యున్నతికి భద్రాచలం, మల్కాపల్లి, గుండాల, కొత్తగూడెం, ఏటూరు నాగారం, కర్రమేడు లాంటి డివిజన్ కేంద్రాల పరిధిలో 21 పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే మిలెట్ బెసుడు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ల ద్వారా ఉత్పత్తులను ఇక్రిశాట్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు వివరించారు. అలాగే గిరిజన కార్పొరేషన్ పరిధిలో విజిలెన్స్ వ్యవహారాల పర్యవేక్షణ నిమిత్తం డిప్యూటి రిజిస్టార్ రోజా రమణి నియామక బోర్డు సమావేశంలో అమోదించారు.

ఈ సమావేశంలో 2018-19 ఏడాదికి రూ.250 కోట్లు లక్ష్యానికి రూ.237.75 కోట్లు, 2019-20 ఏడాదికి రూ.400 కోట్ల లక్ష్యానికి డిసెంబర్2019 నాటికి రూ.256 కోట్లు ఆదాయం ఆర్జించినట్లు నివేదించారు. మూడు మాసాలల్లో మిగితా లక్ష్య సాధన దిశగా దృష్టి సారించాలని అదేశించారు. ఇదిలా ఉండగా 2020-2021 ఏడాది లక్ష్యాలను ప్రతిపాదించాలని సూచించారు. ఈ సమావేశంలో కమిషనర్ క్రిస్టినా చోంగ్తు జడ్ తదితరులు పాల్గొన్నారు.

TS Tribal Corporation in progress
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News