Wednesday, April 17, 2024

జూనియర్ కాలేజీలకు మూడు రోజులే సంక్రాంతి సెలవులు

- Advertisement -
- Advertisement -

TS Inter Board

 

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(టిఎస్ బిఐఇ) సంక్రాంతి పండుగ సెలవులను ప్రకటించింది. జూనియర్ కాలేజీలకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వగా, పాఠశాలలకు ఐదు రోజుల సెలవులు ఇచ్చింది. జనవరి 13వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు జూనియర్ కాలేజీలు మూతపడనున్నాయి. 16న కాలేజీలు తిరిగి పున:ప్రారంభంకానున్నాయి. పాఠశాలలకు జనవరి 12వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. ఆర్టీసి సమ్మె సమయంలో వారం రోజులు విద్యాసంస్థలకు సెలవులను పొడిగించిన ప్రభుత్వం.. రెండో శనివారాన్ని కూడా పనిదినంగా ప్రకటించి సిలబస్ పూర్తిచేయాలని తెలిపింది. దీంతో ప్రతీ ఏడాది సంక్రాంతికి పది రోజులు సెలవులు ఇవ్వగా.. ఈ సంవత్సతరం మాత్రం సంక్రాంతి పండుగ సెలవులనను సగానికి కుదించారు.

TSBIE Announced Sankranti holidays 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News