Wednesday, April 24, 2024

టిఎస్‌పిఎస్‌సి లీకేజీ కేసు.. రెండో రోజు సిట్ విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి లీకేజీ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు కొనసాగుతోంది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితులను సిట్ అధికారులు రెండో రోజు విచారించనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్యనాయక్, రాజేశ్వర్ ను సుదీర్ఘంగా విచారించి వారి నుంచి కీలక విషయాలను రాబట్టనున్నారు. విచారణలో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు మరోసారి విచారించి మరిన్ని వివరాలు రాబట్టారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అధికమార్కులు వచ్చిన వారిపైనా సిట్ అధికారులు దృష్టిసారించారు. టిఎస్‌పిఎస్‌సి నుంచి 100కు పైగా మార్కులు వచ్చిన వారి వివరాలు సేకరించిన అధికారులు ఆ అభ్యర్థులతో ఒక జాబితా తయారు చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ అర్హత పొందిన అభ్యర్థులకు ఫోన్లుచేసి వారి వివరాలు సేకరించారు. మరికొందరిని సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు.

సిట్ కార్యాలయం వద్ద స్టూడెంట్స్.. పేరెంట్స్..

హిమాయత్ నగర్, సీట్ కార్యాలయానికి స్టూడెంట్స్, వారి పేరెంట్స్ వచ్చారు. అనంతరం విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ మమ్మల్ని ఫోన్ ద్వారా సిట్ అధికారులు సంప్రదించారన్నారు. తాము యూపీఎస్సీకి ప్రిఫేర్ అయ్యామని, గ్రూప్ వన్ పరీక్షలు రాశామని, అందరికీ 101 పైగా మార్కులు వచ్చాయన్నారు. దాదాపు 15 మందిని సిట్ అధికారులు రప్పించారని, వివరాలు తీసుకున్నారని చెప్పారు. తమకు టిఎస్‌పిఎస్‌సిపేపర్ లీకేజీ నిందితులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జనరల్‌గా తమ వివరాలను సిట్ అధికారులు సేకరించారని, వారికి తాము సహకరించామని స్టూడెంట్స్ చెప్పారు. అలాగే ఫామ్ ఫిలప్ చేయించుకున్నారన్నారు. టిఎస్‌పిఎస్‌లో వచ్చిన ‘కీ’ ఆధారంగా స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారని, మేము ఈ కేసులో నిందితులను కామని, మమ్మల్ని అడిగినా వాటన్నింటికి వివరాలు అందించామని విద్యార్థులు తెలిపారు. కాగా గ్రూప్ 1లో 100కి పైగా మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News