Saturday, April 20, 2024

నర్సింగ్ పోస్టుల భర్తీకి మెరిట్ లిస్టు విడుదల

- Advertisement -
- Advertisement -

TSPSC released revised merit list

హైదరాబాద్ : ఎట్టకేలకు నర్సింగ్ పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి సోమవారం మెరిట్ లిస్టును విడుదల చేసింది. ఈనెల 24వ తేది నుంచి వచ్చే నెల 3వ తేది వరకు టిఎస్‌పిఎసి కార్యాలయంలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ను నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా 2017లో టిఎస్‌పిఎస్‌సి సుమారు 3311 వేలకు పైగా నర్సింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి 2018లో పరీక్షలు పూర్తయ్యాయి. అయితే కోర్టు, వివిధ కారణాలతో తుది మెరిట్ లిస్టు విడుదల కాలేదు. ఈక్రమంలో కోర్టు సూచనతో గతేడాది నవంబరు నెలలో అధికారులు మెరిట్ లిస్టును ప్రకటించారు. అయితే వివిధ కారణాలతో ఆలస్యమైన తుది మెరిట్ లిస్ట్ పై చాలా మంది అభ్యర్ధులు అనుమానాలు వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సరిగ్గా చేయలేదని, నకిలీ సర్టిఫికెట్లను సరైనవిగా తీసుకుని అనర్హులకు మెరిట్ లిస్టులో చోటు కల్పించారనే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో విచారణ కొరకు ప్రత్యేక కమిటీ వేసింది. సుమారు 3 నెలల పాటు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి తుదిమెరిట్ లిస్టును విడుదల చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News