Home తాజా వార్తలు మేడారం జాతరకు ప్రత్యేకంగా 4 వేల ఆర్‌టిసి బస్సులు

మేడారం జాతరకు ప్రత్యేకంగా 4 వేల ఆర్‌టిసి బస్సులు

medaram-jataraవరంగల్: ఈ నెల 17 నుంచి 20 వరకు జరుగనున్న సమ్మక్క సారక్క మేడారం జాతర కోసం తెలంగాణ ఆర్‌టిసి ప్రత్యేకంగా 4 వేల ఆర్‌టిసి బస్సులను ఏర్పాటు చేసింది. మేడారం వద్ద ఆర్‌టిసి 50 ఎకరాల స్థలంలో బస్సు షెల్టర్‌ను ఏర్పాటు చేసినట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్‌టిసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. దేశంలో కుంభమేళా తర్వాత ఆ స్థాయిలో భక్తులు వచ్చే రెండవ జాతర మేడారం జాతర.