Home తాజా వార్తలు ఆర్‌టిసి బస్సు బోల్తా: 60 మందికి గాయాలు

ఆర్‌టిసి బస్సు బోల్తా: 60 మందికి గాయాలు

 TSRTC Bus

 

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సోమన్ పల్లి దగ్గర బుధవారం ఉదయం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 60 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మంథని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలువ వెల్లడించాయి. ప్రమాద సమయంలో బస్సులో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు గోదావరిఖని నుంచి భూపాలపల్లి వెళ్తుండగా ఆర్‌టిసి బస్సు బోల్తాపడింది. మానేరు వంతెన దాటుతున్న క్రమంలో బస్సు అదుపుతప్పి గొయ్యిలో పడింది. భూపాలపల్లి ఎస్పీ భాస్కరన్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

TSRTC Bus Roll Over Incident in Peddapalli