Home ఖమ్మం గుండెపోటుతో ఆర్‌టిసి డ్రైవర్ మృతి

గుండెపోటుతో ఆర్‌టిసి డ్రైవర్ మృతి

TSRTC Driverఖమ్మం : తెలంగాణలో ఆర్‌టిసి కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఈ క్రమంలో ఆర్‌టిసి కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న  ఖాజామియా (55) ఆదివారం  గుండెపోటుకు గురై చనిపోయాడు. సమ్మె కారణంగా సంభవిస్తున్న పరిణామాలతో ఖాజామియా ఆవేదనకు గురయ్యాడని, ఈ క్రమంలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.  ఖాజామియా గత పదిహేను రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నారు. ఖాజామియా మృతిపై ఆర్‌టిసి కార్మిక సంఘాలు సంతాపం తెలిపాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించాయి.

TSRTC Driver Dead With Heart Attack