Wednesday, February 1, 2023

ఆర్‌టిసి చర్చలు విఫలం…

- Advertisement -

TSRTC-Strikeప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగిరం
ఎస్మా చట్టం విధించే యోచన…?

హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికులు యాజమాన్యం మధ్య గురువారం జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసాయి. మధ్యాహ్నాం ఎర్రమంజిల్ రవాణా శాఖ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ చైర్మన్ సోమేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన చర్చలలో కార్మిక సంఘాల జెఎసి ప్రతిపాదించిన 26 డిమాండ్‌ల పై సమగ్రంగా చర్చించారు. ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్‌టిసి సంస్థను విలీనం చేయాలనే విషయం పై కమిటీ గడువును కోరింది. ఐతే కార్మిక సంఘాలు సంస్థను ప్రభుత్వంలో విలీనం పై నిర్ధిష్టమైన కాలపరిమితి ప్రకటించాలని కార్మిక నేతలు సంఘాలు డిమాండ్ చేశాయి.

ఈ విషయం ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు సమ్మెను చేపట్టవద్దని త్రిసభ్య కమిటీ అధికారులు సూచించారు. ఈ డిమాండ్‌పై స్పష్టత ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదని జెఎసి నేతలు అధికారులకు స్పష్టం చేశారు. దీంతో గురువారం సుదీర్ఘంగా జరిపిన చర్చలో మరో సారి ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ తరుణంలో శుక్రవారం త్రి సభ్య కమిటీ జెఎసి నేతలతో మరో సారి చర్చలు జరుపుతామని ప్రకటించారు. ఇదిలా ఉండగా 5వ తేదీ (శనివారం)నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని జెఎసి కన్వీనర్ ఆశ్వథామరెడ్డి చర్చల అనంతరం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ ప్రకటించారు.

సమ్మె అనివార్య పరిస్థితులు ఎదురైతే, ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై దృష్టి సారించారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రైవేట్ వాహనాలతో పాటు అదనపు సిబ్బంది నియమించాలని యోచిస్తుంది. ఇందులో భాగంగా ఆర్‌టిఏ అధికారులతో విస్తృతంగా త్రి సభ్య కమిటీ ప్రతినిధులు సమావేశాలను జరిపి, ప్రయాణీకుల అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని అదేశాలను జారీ చేశారని తెలిసింది.

అలాగే ప్రైవేట్ రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాల ఏర్పాట్లతో పాటు తాత్కాలిక ప్రాతిపదిక మీదుగా డ్రైవర్, కండక్టర్‌లను నియమించాలని అదేశాలను జారీ చేసినట్లు సమాచారం. రోజ వారీ వేతనాల పై అనుభవజ్ఞలైన ప్రైవేట్ వ్యక్తుల సేవలను ఉపయోగించాలని భావిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బంది కల్గించే చర్యలకు దిగే వారి పై ఎస్మా చట్టం ప్రయోగించాలని యోచిస్తున్నాన్నారు.

TSRTC Employees Strike

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles