Thursday, March 28, 2024

ప్రయాణికుల సమస్యలపై దృష్టి సారించిన ఆర్‌టిసి

- Advertisement -
- Advertisement -
TSRTC focusing on passenger issues
మహిళలకు హెయిల్ అండ్ బోర్డు విధానం అమలు

హైదరాబాద్: ప్రయాణికుల సమస్యలపై ఆర్‌టిసి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రేటర్‌లోని ప్రయాణికులకు కరోనా పట్ల పూర్తి అవగాహన రావడంతో పాటు గ్రేటర్‌లో కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. దాంతో అధికారులు సంస్థ ఆదాయం పెంచేదిశగా చర్యలు తీసుకోవడంతో పాటు వారి భద్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బస్సులను బస్టాపుల్లో ఆపకుండా చూసి చూడనట్లు పోతున్నారని, ప్రయాణికులు పట్టించు కోవడం లేదని ప్రయాణికుల నుంచి ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదు చేయడమే కాకుండా మీడియాలో సైతం ఈ అంశానికి సంబంధించిన కథనాలు వచ్చాయి. రాత్రి సమయాల్లో మహిళలు కార్యాలయాల్లో తమ విధులు ముగించుకుని కొని తిరిగి ఇంటికి వెళేందుకు బస్టాపులో బస్సుల కోసం వేచి చూస్తుంటారు.

కొన్ని సందర్భాల్లో బస్సులను సిబ్బంది ఆపకుండా ముందకు పోవడంతో వారు ప్రత్యామ్నా ఏర్పాట్లలో భాగంగా ఆటోలను, క్యాబ్‌లను ఆశ్రియిస్తున్నారు. దీంతో సంస్థ ఆదాయంపై కూడా ప్రభావం పడుతోంది. దీంతో అధికారులు ముఖ్యంగా రాత్రి సమయాల్లో మహిళా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో మహిళల సౌకర్యం కోసం రాత్రి సమయాల్లో 7.30 గంటల తరువాత బస్‌స్టాపు (స్టేజీల మధ్య) కూడా వారు చెయి ఎత్తితే బస్సును ఆపి ఎక్కించుకునే విధంగా హెయిల్ అండ్ బోర్డు విధానాన్ని అమలు చేసూ గ్రేటర్ హైదరాబాద్ ఈడి వి. వెంకటేశ్వర్లు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంలో మహిళలు ఎటువంటి అసౌకర్యానికి గురైన సంబంధిత డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. సదరు ప్రయాణికులు చేసే ఫిర్యాదు సమగ్ర విచారణ జరిపిన అనంతరం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుల నిమిత్తం సంబంధిత డిపో మేనేజర్, ఫిర్యాదులు విభాగం నెంబ్లరను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి :

శివారు ప్రాంత ప్రయాణికుల సమస్యలపై కూడా తాము దృష్టి సారించామని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయల్లో బస్సులు తక్కువగా తిరుగున్నాయని ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో బస్సుల ట్రిప్పుల సంఖ్యను పెంచడమే కాకుండా అవసరమైతే అదనపు బస్సులను కూడా తిప్పుతామంటున్నారు. త్వరలో ఆయా రూట్లలో ప్రత్యేక సర్వే నిర్వహించి ఎన్ని ట్రిప్పులను పెంచాలి, ఒక వేళ అదను బస్సులు అవసరం అనుకుంటే ఎన్ని బస్సులను తిపాల్సి వస్తుందని అనే అంశంపై అధ్యయనం చేసి తదనుగుణంగా బస్సులు తిప్పుతామని చెబుతున్నారు. ప్రయాణికులకు సుఖవంతమైన ,ఆర్యోవంతమైన ప్రయాణం అందించడమే సంస్థ లక్షమని ఆర్‌టిసిలో బస్సుల్లో ప్రయాణించి సంస్థఆర్దికాభివృద్దికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News