Home తాజా వార్తలు మియాపూర్ డిపోలో 40 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

మియాపూర్ డిపోలో 40 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

 

హైదరాబాద్: నగరంలోని మియాపూర్ డిపోలో 40 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండి సునీల్‌శర్మ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ బస్సులను విమానాశ్రయానికి నడుపుతున్నట్లు తెలిపారు. నాలుగు మార్గాల్లో ప్రతి అరగంటకు ఈ విద్యుత్ బస్సుల సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. వీటిని ఒకసారి చార్జ్ చేస్తే 350 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చని, బస్సులకు సంబంధించిన ఛార్జింగ్ పాయింట్స్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు ప్రయాణించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. కాలుష్య నియంత్రణకు విద్యుత్ బస్సులు ఎంతో ఉపయుక్తమన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు వాడడంలో దేశంలోనే టిఎస్ ఆర్టిసి మొదటి స్థానంలో ఉందని ఆయన తెలిపారు.

TSRTC Inaugurates 40 Electric Buses in Miyapur Depot