కిలోమీటర్‌కు 20 పైసలు పెంపు
పల్లెవెలుగు కనీస చార్జి రూ.5 నుంచి రూ.10కు పెంపు
సెమీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులో కనీస చార్జ్జి రూ.10
సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లోనూ కనీస చార్జ్జి రూ.10
సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస చార్జి రూ.10
ఎక్స్‌ప్రెస్ కనీస చార్జి రూ.10 నుంచి రూ.15కు పెంపు
డీలక్స్ కనీస చార్జి రూ.15 నుంచి రూ.20 వరకు పెంపు
సూపర్ లగ్జరీలో కనీస చార్జ్జి రూ.25
రాజధాని, వజ్ర బస్సులో కనీస చార్జిరూ.35
గరుడ ఎసి, గరుడ ప్లస్ ఏసీలో కనీస చార్జిరూ.35
వెన్నెల ఎసి స్లీపర్‌లో కనీస చార్జి రూ.70
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పెరిగిన కొత్త చార్జీలు మంగళవారం నుంచి అమలవుతు న్నాయని యాజమాన్యం పేర్కొంది. సమ్మె తరు వాత ఆర్టిసి ఉద్యోగులను విధుల్లోకి తీసుకునే సమయంలో చార్జీలు పెంచుతున్నామని సిఎం కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచుతామని వెల్లడించారు. ఆర్టిసిలో బస్సు ఛార్జీలు మూడేళ్ల తరువాత తాజాగా పెరిగాయి. ఈ క్రమంలోనే ఛార్జీల పెంపు సోమవారం అర్థరాత్రి 12 గంటల నుంచి అమల్లో ఉంటాయి. దాదాపు ఎనిమిదివారాల పాటు సాగిన తెలంగాణ ఆర్టిసి సమ్మె ముగిసిన తరువాత గత నెల 29 నుంచి విధుల్లో చేరారు. సిఎం కెసిఆర్ వెల్లడించిన ప్రకారం పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రావాల్సివుంది.
అయితే, ఆర్టిసి ఉద్యోగులతో సిఎం కెసిఆర్‌తో సహా రవాణా శాఖ అధికారులందరూ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో చార్జీల పెంపునకు సంబంధించిన అంశం అనుకున్నదానికంటే ఒకరోజు ఆలస్యంగా అమల్లోకి వచ్చింది. టిమ్స్ మిషన్లు, టికెట్లలో మార్పులు తదితర సాంకేతిక అంశాల సవరణ దృష్టా మంగళవారం నుంచి పెంపు ధరలు అమల్లోకి వచ్చాయి. అంతేకాకుండా సమ్మె వల్ల దాదాపుగా రెండునెలలు పాటు టిమ్స్‌లో ఎక్కువ శాతం మూలనపడ్డాయి. ఈ క్రమంలోనూ వాటిని పూర్తిస్థాయిలో తనిఖీ చేసి వాడకంలోకి తీసుకువచ్చారు. ఇంధన, విడిభాగములు, టైర్లపై పెరిగిన ధరల వల్ల ప్రతియేటా సంస్థపై అదనపు భారం పడుతున్నది. అందువల్ల బస్సు ఛార్జీల పెంపు అనివార్యం అయ్యింది. టోల్ ప్లాజా రుసుము, జిఎస్టి, ప్యాసింజర్ సెస్‌ను ఆర్టిసి అదనంగా వసూలు చేయనుంది. ఈ కొత్త ఛార్జీల వల్ల సంవత్సరానికి ఆర్టిసికి అదనంగా రూ.700 ఆదాయం సమకూరుతుందని అంచనా.
కిలోమీటర్‌కు ఆర్టిసి వసూలు చేసే మొత్తం..
కనీస ఛార్జీపై కిలోమీటర్‌కు 20 పైసలు అధికంగా వసూలు చేయాలని ఆర్టిసి నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఆయా బస్సులు కిలోమీటర్‌కు వసూలు చేసే మొత్తం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పల్లె వెలుగు 83 పైసలు, సెమీ ఎక్స్‌ప్రెస్ 95 పైసలు, ఎక్స్‌ప్రెస్ 107 పైసలు, డీలక్స్ 118 పైసలు, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ 136 పైసలు, రాజధాని ఎసి, వజ్ర 166 పైసలు, గరడ ఎసి 191 పైసలు, గరుడ 202 పైసలు వసూలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రౌండింగ్ ధర యథావిధిగా కొనసాగనుంది. ఛార్జిల పెంపుతో స్టూడెంట్ పాసులకు పెంపుదల వరిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్‌పాస్ ధరలు కూడా పెరగనున్నాయి. సిటీ ఆర్డినరీ బస్‌పాస్ ఛార్జిని రూ.770 నుంచి రూ.950కు పెంచారు. మెట్రో బస్ పాస్ ఛార్జ్ రూ.880 నుంచి రూ.1070కు పెంచారు. మెట్రో డీలక్స్ బస్‌పాస్ ఛార్జ్‌ని రూ.990 నుంచి రూ.1180 వరకు పెరిగింది.
ఆర్టిసి ఉద్యోగులకు అందిన సెప్టెంబర్ వేతనాలు
హైదరాబాద్: ఆర్టిసి కార్మికులకు సెప్టెంబర్ వేతనాలు వారి ఖాతాలలో జమ అయ్యాయి. ఆదివారం సిఎం కెసిఆర్‌తో ప్రగతిభవన్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ విషయంపై సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. 3వ తేదీన ఆర్టిసి ఉద్యోగుల ఖాతాల్లో సెప్టెంబర్ వేతనాలు జమ అవుతాయని వెల్లడించారు. అయితే 2వ తేదీ సాయంత్రానికే అందరి ఖాతాల్లో డబ్బు జమవ్వడం పట్ల ఉద్యోగులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
పల్లెవెలుగుకు ప్రస్తుత సవరించిన ఛార్జీల వివరముల పట్టిక
మార్గం పాత ఛార్జి కొత్త ఛార్జి
సిద్దిపేట-హన్మకొండ 61 83
జెబిఎస్-గజ్వేల్ 41 54
సంగారెడ్డి-పటాన్ చెరు 16 21
హన్మకొండ-నర్సంపేట 29 35
ఆదిలాబాద్-నిర్మల్ 58 76
నిర్మల్-నిజామాబాద్ 9 64
ఖమ్మం-కోదాడ 24 34
హైదరాబాద్-వికారాబాద్ 50 65
హైదరాబాద్-కల్వకుర్తి 61 80
వివిధ పట్టణాల నుంచి ప్రముఖ నగరాలు/పట్టణాలకు ప్రస్తుత సవరించిన ఛార్జీల వివరాల పట్టిక
ఎక్స్‌ప్రెస్ సూపర్ లగ్జరీ రాజధాని(ఎసి) గరుడ ప్లస్(ఎసి)
మార్గం పాత-కొత్త పాత-కొత్త పాత-కొత్త పాత-కొత్త
జెబిఎస్-కరీంనగర్ 148 180 195 230 269 310 330 370
హైదరాబాద్-హన్మకొండ 130 170 185 215 260 290 310 350
హైదరాబాద్-నిజామాబాద్ 174 210 232 270 294 330
హైదరాబాద్-ఖమ్మం 179 220 238 280 326 370 400 440
ఖమ్మం-భద్రాచలం 110 135 146 175 208 220
హైదరాబాద్-ఆదిలాబాద్ 394 460 523 590
హైదరాబాద్-నిర్మల్ 220 270 290 345 363 445
హైదరాబాద్-మహబూబ్‌నగర్ 95 115 125 145
సంగారెడ్డి-విజయవాడ 409 180
హన్మకొండ-బెంగళూర్ 884 1045 1049 1350 1303 1620
హైదరాబాద్-బెంగళూర్ 1010 1290
హైదరాబాద్-పూనె 1305 1500
హైదరాబాద్-షిరిడి 1245 1610
హైదరాబాద్-తిరుపతి 1130 1170
హైదరాబాద్-విజయవాడ 570 620
హైదరాబాద్-రాయచూర్ 195 224
మూడేళ్లల్లో ఆర్టిసి నష్టం రూ.1,801.57 కోట్లు
ఆర్టిసి ఆర్థిక పురోగతికి చార్జీల పెంపు తప్పనిసరి
బస్సు సర్వీసుల్లో కి.మీ.కు 20 పైసలచొప్పున పెంపు
హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్థిక పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించగా వరుసగా గత మూడేళ్లకుగానూ రూ.1,801.57 కోట్లు నష్టం వచ్చింది. 2,016..17 ఆర్థిక సంవత్సరానికి ఆర్టిసికి రూ.4,233.05 కోట్లు ఆదాయం సమకూరగా రూ.4,982.33 కోట్ల వ్యయం అయింది. దీంతో ఆ ఏడాది రూ.749.28 కోట్ల నష్టం వచ్చినట్లు తేలింది. అదేవిధంగా 2,017..18 ఆర్థిక సంవత్సరానికి రూ.4,570.37 కోట్ల ఆదాయంరాగా, రూ.5,319.27 కోట్లు ఖర్చులయ్యాయి. ఆ సంవత్సరానికి రూ.748.90 నష్టం వచ్చింది. 2018..19 ఆర్థిక సంవత్సరానికి రూ.4,882.72 కోట్ల ఆదాయంలో రూ.5,811.39 కోట్ల వ్యయంతో రూ.928.67 కోట్లు నష్టం తేలింది.
2019..20 ఏడాదిలో రూ.2,057.87 కోట్ల ఆదాయంరాగా రూ.2,361.25 కోట్ల ఖర్చులుపోనూ రూ.303.39 కోట్లు నష్టం మిగిలింది. ఈ విధంగా మూడేళ్లపాటు వరుసగా కార్పొరేషన్‌కు నష్టం వాటిల్లుతున్న క్రమంలో ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు, ఆర్థిక పురోగతి సాధించేందుకు ఆర్‌టిసిలోని అన్ని సర్వీసులలో కిలోమీటరుకు 20 పైసలు చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులతోపాటు విద్యార్థుల బస్‌పాస్‌లకు అదే విధానంలో ఛార్జీలు పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది.