Wednesday, April 24, 2024

అయ్యప్ప భక్తులకు టిఎస్ ఆర్టీసీ శుభవార్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్ ఆర్టిసి సంస్థ అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త తెలుపుతుంది. పవిత్ర కార్తీక మాసం కావడంతో నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీగా వస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులు ప్రైవేటు సంస్థల బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తూ రాయితీతో బస్సులను టిఎస్ఆర్టిసి సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల యాత్రను సురక్షితంగా వెళ్లి రావడానికి అనువుగా టిఎస్ ఆర్టిసి సంస్థ భక్తుల కోసం కొంత రాయితీపై ప్రత్యేక టిఎస్ఆర్టిసి బస్సులను సమకూరుస్తున్నామని సంస్థ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ తెలియజేశారు. టిఎస్ఆర్టిసి సంస్థ బస్సులలో అనుభవజ్ఞులైన డ్రైవర్లతో కూడిన బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. శబరిమల యాత్ర బస్సులపై ఎలాంటి డిపాజిట్ లేకుండా 10% రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్,ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

అదనపు సీట్ల కోసం ఇద్దరు గురుస్వాములు, 02 వంట మనుషులు, 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు, ఒక అటెండర్ను ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి ప్రయాణం ఉచితమన్నారు. టిఎస్ ఆర్టిసి వారి ప్రత్యేక బస్సులలో ఆడియో, వీడియో తోపాటు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. ఈ బస్సును అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుండి దర్శించ వలసిన పుణ్యక్షేత్రాల వరకు నడపబడునని చెప్పారు. అయ్యప్ప స్వామి భక్తుల కోసం అందుబాటులో టిఎస్ఆర్టిసి డిపోలలో అవసరమైన బస్సులు కలవని ఆయన చెప్పారు.

శబరిమల యాత్ర దూర ప్రయాణం కావున టిఎస్ఆర్టిసి సంస్థ వారి సురక్షితమైన డ్రైవర్ల చేత నడపబడుతున్న బస్సు ప్రయాణం సురక్షితం – శుభ ప్రధమణి సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. టిఎస్ఆర్టిసి బస్సులలో ముందస్తు సీట్ రిజర్వేషన్ కొరకు, శబరిమల యాత్రకు కావలసిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్ ల కొరకు www.tsrtconline.in సందర్శించండి. అడ్వాన్స్ బుకింగ్ పై 10శాతం రాయితీ పొందండన్నారు.సలహాలకు, సూచనలకు, ఫిర్యాదుల కొరకు టిఎస్ ఆర్టీసి కాల్ సెంటర్ 040 23450033, 69440000 సంప్రదించగలరని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News