Tuesday, April 23, 2024

అడ్డంకుల్లేవ్.. రైట్ రైట్

- Advertisement -
- Advertisement -

TS-RTC

కర్ఫ్యూ నిబంధనల నుంచి
ఆర్‌టిసి బస్సులకు పూర్తిస్థాయిలో మినహాయింపు
జెబిఎస్‌తో పాటు ఇమ్లీబన్ బస్‌స్టేషన్‌కూ రాకపోకలు

హైదరాబాద్ : ప్రయాణీకులకు నిజంగా ఇది శుభవార్త.. గురువారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి ఆర్టీసీ బస్సులను మినహాయింపునిస్తున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో హైదరాబాద్‌లో సిటీ బస్సులు మినహాయించి జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కరోనా జాగ్రత్తలతో జిల్లాల్లో ప్రయాణీకులను గమ్యస్థానాలకు బస్సులు చేర్చుతున్నాయి. జిల్లాల నుంచి వచ్చే బస్సులన్నీ హైదరబాద్ శివారు ప్రాంతాలైన హయత్‌నగర్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్ తదితర ప్రాంతాల వరకే పరిమితమయ్యాయి.

కరోనా భయంతో తొలి రోజు బస్సులో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉన్న తర్వాతి కాలంలో కొంతమేర ప్రయాణికుల శాతం పెరిగింది. తాజా మినహాయింపులననుసరించి జిల్లాల నుంచి వచ్చే బస్సులు జేబీఎస్‌తో పాటు ఇమ్లీబన్‌లో కూడా అగేందుకు అవకాశం ఇచ్చారు. ప్రగతి భవన్‌లో బుధవారం ఆర్టీసీపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ, ఇడి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో బస్సు సర్వీసులు పునరుద్ధరణ జరిగిన తర్వాత పరిస్థితులను వారు సిఎం కెసిఆర్‌కు వివరించారు. ంలో కూడా ఆర్టీసీ బస్సులు గమ్యస్థానానికి చేరేందుకు అవకాశం కల్పిస్తారు. బస్టాండ్‌లలో ట్యాక్సీలు, ఆటోలు తదితర రవాణా వాహనాలను అనుమతిస్తారు. బస్సు టికెట్ కలిగిన ప్రయాణీకులు కర్ఫూ సమయంలో కూడా ప్రైవేటు వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవడానికి పోలీసులు అభ్యంతర పెట్టారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులన్నీ జేబీఎస్‌లోనే ప్రయాణీకులను దింపుతున్నాయి. గురువారం నుంచి ఇమ్లీబన్‌కు కూడా బస్సులు వచ్చి పోతాయి.

సిటీ బస్సులు, అంతరాష్ట్ర సర్వీసులకు
మరికొంతకాలం బ్రేక్…!

హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న క్రమం లో సిటీబస్సులకు మరికొంతకాలం బ్రేక్ పడే అవకాశం ఉంది. అంతరాష్ట్ర సర్వీసులను సైతం ఇప్పటికిప్పుడే అనుమతించే ప్రసక్తి ఉండదు. ప్రధానంగా గ్రేటర్ పరిధిలోనే సిటీబస్సులు తిరుగాడుతుండటం.. అందునా సిటీ బస్సుల ద్వారా వచ్చే ఆదాయం సైతం అధికంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సిటీబస్సులను నడపడం సాధ్యపడదన్నది నిర్వివాదాంశం. అయితే, సిటీబస్సులు, అంతరాష్ట్ర సర్వీసులను సైతం నడిపేందుకు ఆర్టీసీ ఇప్పటికే సన్నద్ధమైంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి అనుమతినివ్వడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే ఒనగూరే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ప్రధానంగా సిటీ బస్సులలో సోషల్ డిస్టెన్స్ పాటించడమన్నది సాధ్యపడదని చెబుతున్నారు. జిల్లాల సర్వీసులు ప్రారంభమైనప్పుడే 33 శాతం మేర టికెట్లు రేట్లు పెంచాలన్న ఆర్టీసీ అధికారుల ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఉన్నంతలోనే సోషల్ డిస్టెన్స్‌ను కరోనా నిబంధనలను ప్రయాణీకులు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించింది. లాక్‌డౌన్ వేళ ప్రజలపై అదనపు భారం మోపే ప్రసక్తి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ మరింత నష్టాల్లో పడకుండా ఉండే విధంగా తాజాగా లాక్‌డౌన్ కర్ఫూ (సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు) నిబంధనలనుంచి మినహాయింపునిచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News