Thursday, April 25, 2024

మేడారానికి ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

TSRTC

దరాబాద్: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్‌టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 8 వరకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్, జగద్గిరిగుట్ట, నేరేడ్‌మెట్, కెపిహెచ్‌బి, మియాపూర్, లింగంపల్లి, లాల్ దర్వాజ మొదలగు ప్రదేశాల నుంచి బయలుదేరి, ఉప్పల్‌లోని వరంగల్ పాయింట్ మీదుగా బస్సులు నడుపుతున్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులు వివరాలను రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ వరప్రసాద్ సోమవారం ఎంజిబిఎస్‌లోని ఆయన కార్యాలయంలో ప్రకటించారు.

ప్రయాణికుల సౌకర్యార్థం క్యూలైన్లను, బుకింగ్ కౌంటర్లను, బస్సులను, ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు ప్రతి పాయింట్‌లో డిపో మేనేజర్‌లకు, ట్రాఫిక్ సూపర్‌వైజర్ స్థాయి అధికారులకు, సెక్యూరిటీ సిబ్బందికి బాధ్యతలు అప్పగించినట్లు వరప్రసాద్ తెలియజేశారు. ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం మేడారం జాతరకు వెళ్లేందుకు అడ్వాన్స్ రిజర్వేషన్(www.tsrtconline.in) సౌకర్యం కల్పించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం నాడు అధికరద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయోగాత్మకంగా ప్రత్యేక బసుసలు ఆన్‌లైన్‌లో ఏర్పాటుచేయడం జరిగిందని ఆర్‌ఎం వరప్రసాద్ చెప్పారు.

మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు…

ఎంజిబిఎస్ 83309 33419, 83309 33537, 83309 33532, 99592 26257
జెబిఎస్..040 2780 2203, 99592 26246, కెపిహెచ్‌బి..99592 25120, కెపిహెచ్‌బి ఏజెంట్.. 94904 84232, లింగంపల్లి 99592 25120,

లింగంపల్లి ఏజెంట్ 99499 99162, మియాపూర్ ఎక్స్ రోడ్ ఏజెంట్ 92480 08595, ఇసిఇఎల్ ఏజెంట్ 98662 70709, చింతల్(జగద్గిరిగుట్ట) 99592 26250, చింతల్ ఏజెంట్ 94402 20265, ఉప్పల్ క్రాస్ రోడ్స్ 99592 26249.

medaram

Medaram-Jatara

TSRTC To Run Special Buses For Medaram Jatara

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News