Home జాతీయ వార్తలు నేటి నుంచి టిటిడి పుష్కర యాత్ర

నేటి నుంచి టిటిడి పుష్కర యాత్ర

TIRUMALAతిరుమల : టిటిడి తరపున కృష్ణా పుష్కర యాత్ర బుధవారం ఉదయం తిరుమల నుంచి ప్రారంభం కానుంది. విజయవాడలోని పిడబ్లూడి మైదానంలో టిటిడి నిర్మిస్తున్న శ్రీవారి నమూనా ఆలయంలో వివిధ రకాల కైంకర్యాలు నిర్వహించేందుకు భూదేవి,శ్రీదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను కల్యాణరథంలో తిరుమల నుంచి పుష్కరయాత్రకు తీసుకెళ్లనున్నారు. ఈ యాత్ర తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం, కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, మహానంది ఆలయం, శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి ఆలయం, గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీనర్సింహాస్వామి వారి ఆలయం మీదుగా విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి, అక్కడి నుంచి అమరావతి మీదుగా శ్రీవారి నమూనాను ఆలయానికి యాత్రగా తీసుకొస్తారు.