Home నిజామాబాద్ ఎంపి కవిత బండారం బయటపెడతాం

ఎంపి కవిత బండారం బయటపెడతాం

టిటిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ సవాల్
16 మాసాల్లో 1550 మంది రైతుల ఆత్మహత్యలు
పోలీసు కేసులు పెట్టినా తాము భయపడం.. రొమ్ము విడిచి రాజీలేని పోరాటం చేస్తాం
రైతులకు రూ.90 కోట్లు ఇస్తే ప్రభుత్వ ఖజానాకేమి బొక్కపడదు: మోత్కుపల్లి నర్శింహులు
10న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలి: బిజెపి నేత డాక్టర్ లక్ష్మణ్
TDP జిల్లా కేంద్రంలోని స్థానిక ధర్నా చౌక్‌లో గురువారం జరిగిన తెలుగుదేశం, బిజెపి మిత్ర పక్షాల పార్టీల ఆధ్వర్యంలో జరిగిన రైతు మహాధర్నా కార్య క్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై ప్రసంగించారు. రైతుల ఆత్మహత్యల కుటుంబాలకు ఆర్థిక సహాయం అంటూ బతుకమ్మ సంబరాలంటూ సమయం దొరికిన ప్పుడల్లా విదేశీయానం చేస్తూ కోట్ల రూపాయల కలెక్షన్‌లు చేసుకుని వస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా ధనా న్ని కొల్లగొడుతున్న ఎంపి కవిత బండారాన్ని త్వరలో బయ టపెడతానని ఆయన అన్నారు. ప్రజల నుంచి వసూళ్ళు చేసిన కలెక్షన్‌లతో దుబాయ్‌లో ఒక పెద్ద షాపింగ్ కాంప్లె క్స్‌ను నిర్మిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ సారి దుబాయ్‌కు వెళ్ళినప్పుడు కవిత షాపింగ్ కాంప్లెక్స్ కథా కమామిషును తెలుసుకుని ఆధారాలతో సహా వచ్చి ఆమె బండారాన్ని జగిత్యాల ఓటరుగా బయటపెడతానని అన్నా రు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు పాల్పడినా, అరెస్టులు, పోలీసు కేసులు పెట్టినా తాము భయపడేది లేదంటూ రొమ్ము విడిచి రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 16 మాసాల్లో 1550 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా రెండు వందల మందే చనిపోయా రంటూ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెప్పి రైతాంగ వ్యతిరేకుడిగా తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడని శాసనసభా బిజెపి పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. 1550 మంది రైతులకు ఆరు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో తక్కువ సంఖ్యను ప్రకటించడం మూర్ఖత్వమన్నారు. శాసన సభా బిజెపి ఉప పక్ష నేత చింతా రాంచంద్రా రెడ్డి మాట్లాడుతూ ఒక వేళ చనిపోయిన రైతులందరికీ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సి వస్తే మొత్తంగా రూ. 90 కోట్లు మాత్రమే అవుతుందని ఇదేమి ప్రభుత్వానికి ఒక లెక్క కాదన్నారు. టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మోత్కు పల్లి నర్శింలు మాట్లాడుతూ తన సెక్యూరిటీ కార్లకు, గుళ్ళకు, పోలీసు వాహనాలకు, క్రీడాకారులకు వందల కోట్లు కేటాయిస్తున్నప్పుడు చనిపోయిన రైతులకు రూ.90 కోట్లు ఇస్తే ప్రభుత్వ ఖజానాకేమి బొక్కపడదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకున్న 1200 మంది విషయంలో కూడా నాలుగు వందల మందే చనిపో యారంటూ వారికి 10 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యోగం అందించారని మిగతా 800 మంది అమరవీరుల కుటుం బాలను వీధి పాలు చేశారని టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మండవ వేంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 10న చేపడుతున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసిఆర్ నిరంకుశత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరపడుతున్నాయని టిడిపి జిల్లా అధ్యక్షులు అరికెల నర్సా రెడ్డి అన్నారు.
రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మిత్రపక్షాలుగా తెలుగుదేశం, బిజెపిలు ఐక్య ఉద్యమాలను నిర్మిస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్యాబినేట్‌లో ఒక్క మహిళ కూడా లేకపోవడం మహిళలను అగౌరవపరిచడమేనని మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ అన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు యెండెల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, ఎన్‌సి ఎస్‌ఎఫ్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు చింతా సాంబమూర్తి, గీత, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, మురళీధర్ గౌడ్, టిడిపి నాయకులు రమేష్ రాథోడ్, యూసుఫ్‌ఆలీ, అట్లూరి రమాదేవి, అమర్‌నాథ్ బాబు, నేరేళ్ళ ఆంజనేయులు, రాజారాంయాదవ్, ప్రభాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.