Thursday, April 25, 2024

కిమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స

- Advertisement -
- Advertisement -

Pregnant Ovary

 

హైదరాబాద్ : ఓ గర్భిణికి అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించిన కిమ్స్ వైద్యులు తల్లితోపాటు శిశువు ప్రాణాలను కాపాడారు. నందిని (27) నాలుగు నెలల గర్భిణి కాగా ఆమెకు అండాశయలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో నందిని చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రిలో చేరగా కిమ్స్ గైనకాలజిస్టు డాక్టర్ చీపురుపల్లి వసుంధర నేతృత్వంలో వైద్య బృందం లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స(మినిమల్ యాక్సెస్ సర్జరీ) నిర్వహించి ఆ కణితిని విజయవంతంగా తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ వసుంధర మాట్లాడుతూ 5వేల మందిలో ఒక్కరి ఈ విధంగా అండాశయంలో కణితి ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు.

ఈ కణితి పెద్ద పరిణామం వరకు పెరిగి స్థలాన్ని ఆక్రమించి పేగులు, మూత్రనాళం, మూత్రకోశంపై ఒత్తిడిని పెంచడమే కాకుండా కణితి తొడిమ మెలితిరిగి తల్లితో పాటు గర్భస్థ శిశువుకు సైతం కడుపులో భరించలేని నొప్పి వస్తుందని తెలిపారు. అయితే గర్భదాల్చిన తర్వాత పిండం బతికేందుకు 14 వారాల చాల కీలకమని దీంతో 13 వారాల నిండేవరకు ఆమెను మందులతో కాపాడామని తెలిపారు. ఆ తర్వాత ఈ కేసును సవాల్‌గా స్వీకరించి సంక్లిష్టమైన లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స ద్వారా 20 సెంటీ మీటర్ల పొడవైన కణితిని తొలగించామని తెలిపారు.

Tumor removal from Pregnant Ovary
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News