Home జోగులాంబ గద్వాల్ ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు

ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు

Tungabhadra Pushkaralu Begins At Alampurజోగులాంబ గద్వాల : తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. అలంపూర్ ఘాట్ వద్ద మంత్రులు నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్ఎ అబ్రహం, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. వేదపండితులు  శాస్త్రోక్తంగా తుంగభద్ర నది వద్ద  పూజలు చేశారు. మధ్యాహ్నం 1.23 నిమిషాలకు మంత్రులు పుష్కర స్నానం ఆచరించి అధికారికంగా పుష్కరాలను ప్రారంభించారు.