Home తాజా వార్తలు ప్రముఖ సినీ, టివి నటుడు బోస్ కన్నుమూత

ప్రముఖ సినీ, టివి నటుడు బోస్ కన్నుమూత

Telugu Actor Subhash Chandra Bose

 

హైదరాబాద్ : తెలుగు సినిమాల్లో నటించి అందర్నీమెప్పించిన ప్రముఖ సినీ నటుడు సుభాస్ చంద్ర బోస్‌ ఆదివారం కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం కృష్ణా నగర్‌లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో అతని తలకు తీవ్ర గాయం కావడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. బోస్ ఇడియట్, నిన్నే పెళ్లాడతా, అల్లరి రాముడు, శివమణి, సాహసపుత్రుడు సినిమాతో బోస్‌ నటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. చిరంజీవి ‘కొదమ సింహం’, సురేశ్‌బాబు ప్రొడక్షన్స్‌లో వచ్చిన ‘ప్రేమఖైదీ’ సినిమాల్లో నటించాడు. అలాగే హిందీలో ‘ప్రతిబంధ్‌’ సినిమాలో కూడా నటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గులాబి’ (1995) నుంచి ‘డేంజర్‌’ (2005) వరకు దాదాపు ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ బోస్ సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించారు. పూరీ జగన్నాథ్‌, కృష్ణవంశీ, ఉత్తేజ్‌ తనకు మంచి స్నేహితులని బోస్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పలు తెలుగు టీవీ సీరియళ్ళలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బోస్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Tv and film actor Subhash Chandra Bose passed away