Home తాజా వార్తలు టివిఎస్ మోటార్స్ ఫలితాలు అదుర్స్

టివిఎస్ మోటార్స్ ఫలితాలు అదుర్స్

TVS Motor net profit rises 41% to Rs 277.6 cr

 

చెన్నై : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టివిఎస్ మోటార్స్ 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అద్భుత ఫలితాలు సాధించింది. క్యూ2లో సుమారు 5,169 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.4,605 కోట్లు ఆర్జించగా ఇప్పుడు 22 శాతం ఆదాయం వృద్ధిని నమోదు చేసింది. అదే విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.277.80 నికర లాభా న్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.196.3 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ముడి సరకుల ధరలు, అంతర్జాతీయంగా కంటైన ర్లు, సెమీ కండక్టర్ల కొరత ఉన్నప్పటికీ టివిఎస్ మోటార్స్ గణనీయమైన లాభాలను ఆర్జించడం గమనార్హం. పన్ను ముందు లాభాలు 41 శాతం పెరిగి రూ.377 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు రూ. 267 కోట్లుగా ఉన్నాయి. కాగా జూలైనుంచి సెప్టె ంబర్ మధ్య కాలంలో టివిఎస్ సుమారు 8.70 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.