Home జోగులాంబ గద్వాల్ రాజోలులో జంట హత్యలు

రాజోలులో జంట హత్యలు

Murder

 

రాజోలు: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు ప్రాంతంలో ఓ జంటను దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ మహిళ, మరో వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడు కర్నూలు జిల్లా అలువాల వాసి బడేసాబ్ గా గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంట మధ్య వివాహేతర సంబందం ఉండటంతో ఈ హత్యలు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ ఎవరు అనేది తెలిస్తే ఈ హత్యలు వెలుగులోకి వస్తాయని రాజోలు ఎస్ఐ పేర్కొన్నారు.  

 

Twin Murders in Rajolu Area in Jogulamba Gadwal