Home ఆఫ్ బీట్ ఆదర్శం.. ఆ జంట గ్రామాలు..!

ఆదర్శం.. ఆ జంట గ్రామాలు..!

అభివృద్ధి వైపు ఎలుకుర్తి-ఆరెపల్లి గ్రామాల అడుగులు
ఇప్పటికే ఒడిఎఫ్ గ్రామాలుగా గుర్తింపు
నగదు రహితంగా పన్నుల వసూళ్లకు చర్యలు
ఇంటింటికి ఇంకుడు గుంతలు
కలెక్టర్ ప్రశంసలు అందుకున్న సర్పంచ్‌లు

                 Village

గీసుకొండ : చిన్నోడు.. పెద్దోడు.. అన్న చందంగా ఉంటాయి. మండలంలోని ఆ రెండు గ్రామాలు.. ఒకటి పెద్దది.. మరొకటి చిన్న పల్లె.. దాదాపు రెండు గ్రామాలు కలిసే ఉంటాయి. రెండింటికి మధ్యలో ఉండే తారురోడ్డు గ్రామాలకు విభజన రేఖ.. అదే ఎలుకుర్తి హవేలి.. ఆరెపల్లె గ్రామాలు.. జంట గ్రామాలుగా పేరుగాంచిన ఈ రెండు ఆదర్శంలోనూ పోటీ పడుతున్నాయి. సర్పంచ్‌ల కృషి, గ్రామస్థులు, అధికారుల సహకారంతో ప్రగతి పథంవైపు దూసుకుని వెళుతున్నాయి..

ఎలుకుర్తి హవేలి ప్రత్యేకతలు ఇవీ..
మండలంలోనే చాలా పెద్ద గ్రామం ఎలుకుర్తి, వైశాల్యం, జనాభా పరంగా ఇదే పెద్ద గ్రామం. గ్రామ జనాభా 5 వేలు, 1220 కుటుంబాలు ఉన్నాయి. గతంలో 586 వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండగా సర్పం చ్ భీమగాని సౌజన్య, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కూచన ప్రకాష్‌తో పాటు మండల అధికారుల సహకారంతో కొత్తగా ఏడాదిన్నర కాలం లో 512 ఐఎస్‌ఎల్‌ను నిర్మించారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో ఏ గ్రామంలోనూ తక్కువ కాలంలో నిర్మాణాలు జరగలేదు. దీంతో ఇటీవల గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సర్పంచ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల నగదు ప్రోత్సహాకాన్ని అందజేయడంతో సిసి రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నా రు. ఇప్పటికే కలెక్టర్ గ్రామాన్ని రెండు సార్లు సంద ర్శించగా తాజాగా శనివారం మరో మారు గ్రామానికి వచ్చి పంచాయతీ కార్యాలయ నిర్మాణం కోసం రూ.15 లక్షల నిధులు మంజూరు చేస్తానన్నారు. ఒడిఎఫ్ గ్రామాన్ని నిలిపినందుకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ సౌజన్య కలెక్టర్ ద్వారా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

గ్రామంలో జాతీయ ఉత్తమ స్వయం సహాయక సంఘం(ఎస్‌హెచ్‌జి)గా స్వామి శరణం అయ్యప్ప న్యూఢిల్లీలో అవార్డు అందుకుంది. పొదుపులు చేయడం, తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించడం, లెక్కల నిర్వహణ బాగుండడంతో ఈ సంఘానికి అవార్డు దక్కింది. సర్పంచ్ బీమగాని సౌజన్య మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది గుజరాత్‌కు వెళ్లి అక్కడ నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్నారు.

 

పోలీస్‌శాఖ, గ్రామస్థుల సహకారంతో లైబ్రరి ఏర్పాటు .. సాక్షర భారత్(వయోజనవిద్య) వారు వెయ్యి, పోలీసులు 4 వేల పుస్తకాలను అందజేశారు.
తడి పొడి చెత్త సేకరణ

నగరం రీతిలో గ్రామంలో తడిపొడి చెత్త సేకరణ కార్య క్రమాన్ని ఇటీవలే ప్రారంభించారు. దీని కోసం పంచా యతీ పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేకంగా రిక్షాలను సమకూర్చారు. సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులో వేసే టట్లు ఏర్పాట్లు చేశారు. వందశాతం ఇంటి నల్లా పన్నులు వసూళ్లు చేపడుతున్నారు.

నగదు రహిత లావాదేవీలవైపు..

కాగా గ్రామపంచాయతీలో ఇటీవల స్వైపింగ్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. గ్రామంలోని అందరికి బ్యాంకు ఖా తాలు ఉండేలా చర్యలు చేపట్టారు. ఇంటి నల్లా పన్ను లను నగదు రహితంగా చెల్లించడానికి గ్రామస్తులను మోటివేట్ చేస్తున్నట్లు సర్పంచ్ బీమగాని సౌజన్య, పంచాయతీ కార్యదర్శి కూచన ప్రకాష్ తెలిపారు.

ఆరెపల్లి విజయాలు ఇవీ..

వందశాతం ఇంటిపన్నులు, అన్ని కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు, అన్ని ఇండ్ల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. బహిరంగ మలవిసర్జన రహిత(ఒడిఎఫ్) గ్రామంగా మారడంతో స్వయంగా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి సర్పంచ్ తుమ్మనపెల్లి శ్రీనివాస్, గ్రామస్తులను అభినందించారు. రూ.5 లక్షల నిధులను నగదు ప్రోత్సాహకంగా అందించగా సిసి రోడ్లను నిర్మిస్తున్నారు. ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా ఉంది. నగదు రహిత లావాదేవీల కోసం గ్రామస్థులకు అవగాహన కలిగించే చర్యలు చేపడుతున్నారు. అర్హులైన దంపతులకు ఇద్దరికి మించి పిల్లలు లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నారు
– సర్పంచ్‌కు ముగ్గురు కలెక్టర్ల ప్రశంసలు

సర్పంచ్ తుమ్మనపెల్లి శ్రీనివాస్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతున్నందుకు పలు సందర్భాల్లో జిల్లాలో ప నిచేసిన కలెక్టర్లు అభినందించి ప్రశంసపత్రాలను అందజేశారు. గతంలో కలెక్టర్ గంగాధర్ కిషన్ స్వచ్ఛభారత్ కింద, వాకాటి కరుణ ఉత్తమ జిపి కింద ప్రస్తుత కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఓడిఎఫ్ సా ధించడం, ఉత్తమ స్వచ్ఛ్ గ్రామం కింద రెండు సార్లు రెండు సర్పంచ్‌కి ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఇలాంటి గ్రామాన్ని జిల్లాలో చూడలేదు
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

ఎలుకుర్తి హవేలి లాంటి ఉత్తమ గ్రామం జిల్లాలో లేదని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అభినందించారు. ఆయన గతంలో ఒకసారి శనివారం మరోసారి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా సర్పంచ్ సౌజన్యతో పాటు గ్రామస్తులను అభినందించారు. తక్కువ కాలంలో 512 ఐఎస్‌ఎల్ నిర్మాణాలను చేపట్టడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.