Friday, March 29, 2024

భారత్‌కు ట్విట్టర్ 15 మిలియన్ డాలర్ల సాయం

- Advertisement -
- Advertisement -

Twitter donates $ 15 million to India

 

వాషింగ్టన్ : కరోనా విలయంతో విలవిల్లాడుతున్న భారత్‌కు మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యుఎస్‌ఎ అనే ప్రభుత్వేతర మూడు సంస్థలకు విరాళంగా ఇచ్చినట్టు ట్విట్టర్ సిఇఒ జాక్ పాట్రిక్ డోర్సే సోమవారం ట్వీట్ చేశారు. కేర్ సంస్థకు 10 మిలియన్ డాలర్లు ఇవ్వగా, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యుఎస్‌ఎలకు చెరో 2.5 మిలియన్ డాలర్లు వంతున ఇచ్చినట్టు చెప్పారు.ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు, వెంటిలేటర్లు, బిపాప్, సిపిఎపి యంత్రాలు సేకరించడానికి ఈ సహాయం ఉపయోగపడుతుందని ట్విట్టర్ ప్రకటించింది.

తాత్కాలిక కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటులో ప్రభుత్వానికి కేర్ సంస్థ సహకరిస్తుందని, ఆక్సిజన్ అందిస్తుందని, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు పిపిఇ కిట్లు సమకూరుస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా చూస్తుందని ట్విట్టర్ వివరించింది. ఎయిర్ ఇండియా సహకారంతో కరోనా బాధితులను ఆస్పత్రుల్లో చేర్చడం, వారి చికిత్సలకు అయ్యే ఖర్చులు భరించడం, లాక్‌డౌన్ ఇబ్బందుల్లో ఆయా కుటుంబాలను ఆదుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులను బలోపేతం చేయడం తదితర సహాయ కార్యక్రమాలు జరుగుతాయని ట్విట్టర్ పేర్కొంది. ఈ సహాయానికి సేవా ఇంటర్నేషనల్ కు చెందిన సందీప్ ఖడ్కేకర్ కృతజ్ఞతలు తెలిపారు. దీంతోపాటు హోస్టన్ ప్రధాన కేంద్రంగా ఉన్న సేవా యుఎస్‌ఎ భారత్ సహాయ కార్యక్రమాల కోసం 17.5 మిలియన్ డాలర్ల విరాళాన్ని సేకరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News