Home తాజా వార్తలు కిరణ్ మజుందాస్ షా X నిర్మలా సీతారామన్

కిరణ్ మజుందాస్ షా X నిర్మలా సీతారామన్

Sitharaman, Kiran Mazumdar

 

ఇరువురి మధ్య ట్విట్టర్ సంభాషణ

న్యూఢిల్లీ: ట్విట్టర్ వేదికగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందాస్ షాల మధ్య గురువారం జరిగిన సంభాషణ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇసిగరెట్లను నిషేధిస్తూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై మజుందార్ షా కాస్త ఘాటుగా స్పందించారు. సిగరెట్లపై ఆరోగ్యమంత్రి ప్రకటన చేయాలి కదా? గుట్కా నిషేధం మాటేమిటి? అని మజుందార్ షా ట్విట్టర్‌లో మంత్రిని ప్రశ్నించారు. అంతేకాదు ఆర్థిక వ్యవస్థ కోసం ఏమి చేస్తున్నారు? అని కూడా అడిగారు. దీనిపై నిర్మలా సీతారామన్ స్పందించారు. విలేకరుల సమావేశం కేబినెట్ నిర్ణయాలను తెలియజేయడానికి ఉద్దేశించినదని, ఇ-సిగరెట్ల సమస్యపై నేను మంత్రుల బృందానికి అధిపతిగా హాజరయ్యాను అని అన్నారు.

ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అంతర్జాతీయ సమావేశం కోసం విదేశాలకు వెళ్లారు. సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో పాటు ఇతర క్యాబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. వివరాలు ఇవ్వడానికి ఆరోగ్య కార్యదర్శి కూడా తనతో ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం వెళ్లామని మీరు తెలుసుకోవాలి, అలాగే ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నామని కూడా సీతారామన్ అన్నారు. సీతారామన్ ఇచ్చిన సమాధానానికి ప్రతిస్పందనగా కిరణ్ మజుందార్ ఇప్పుడు అర్థమైందని అన్నారు. తప్పును సరిదిద్దుకున్నాను, గందరగోళాన్ని తొలగించినందుకు, స్పందించినందుకు ధన్యవాదాలు అని షా అన్నారు.

Twitter spat between Finance Minister and Kiran Mazumdar