Friday, March 29, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ నుంచి ఓపియం తెస్తున్న నిందితులు
1,400 గ్రాముల ఓపియం, మొబైల్ ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్: నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,400 ఓపియం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.2.5లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం… రాజస్థాన్‌కు చెందిన హనుమాన్ రామ్ కుత్బుల్లాపూర్‌లో ఉంటూ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు, చున్నీలాల్ తిరుమలగిరిలో ఉంటూ కూలీగా పనిచేస్తున్నాడు. రాజస్థాన్‌కు చెందిన కిల్లు వీరికి ఓపియం పండించి సరఫరా చేస్తున్నాడు. బతుకు దెరువు కోసం రాజస్థాన్ నుంచి వచ్చిన హనుమాన్ రామ్ జీడిమెట్లలోని కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

వచ్చే డబ్బులు తన అవసరాలకు తీరడంలేదు, ఈ క్రమంలోనే చున్నీలాల్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే చున్నీలాల్ డ్రగ్స్‌కు బానిసగా మారాడు, రోజు డ్రగ్స్ తీసుకునేవాడు. దీంతో ఓపియం రాజస్థాన్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ అవసరం ఉన్న వారికి విక్రయించాలని హనుమాన్ రామ్ ప్లాన్ వేశాడు. దీనికి రాజస్థాన్‌కు చెందిన కిల్లు ఓపియం పండించడమే కాకుండా సరఫరా చేస్తున్నాడు. ఇద్దరు కలిసి అతడిని సంప్రదించారు, రాజస్థాన్‌కు వెళ్లి కిల్లు వద్ద 1,400 గ్రాములు ఓపియం డ్రగ్స్‌ను రూ.1,18,000లకు కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చారు. 360 గ్రాముల ఓపియం చున్నీలాల్‌కు ఇచ్చి మిగతాది విక్రయించేందుకు గౌలిగూడకు వచ్చాడు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేసి పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, ఎస్సైలు సంజీవ్ రెడ్డి, సత్యనారాయణ, వెంకటేష్, వేణుగోపాల్, దుర్గా రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News