Wednesday, April 24, 2024

హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Two arrested for selling hash oil

100 గ్రామలు ఆయిల్ స్వాధీనం

మనతెలంగాణ, హైదరాబాద్ : హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 100మిల్లీ లీటర్ల హాష్ ఆయిల్, హీట్‌గన్, డిజిటల్ వేయింగ్‌మిషన్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని మెహిదీపట్నం, గుడిమల్కాపూర్‌కు చెందిన వడ్ల లక్ష్మివెంకట నర్సింహచారి అలియాస్ ఎల్‌విఎన్ చారి అలియాస్ లడ్డు డిజే సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. రాజేంద్రనగర్, అత్తాపూర్, హైదర్‌గూడకు చెందిన ముల్కల భానుప్రకాష్ అలియాస్ భాను క్యూ కనెక్ట్‌లో పనిచేస్తున్నాడు. లక్ష్మివెంకటనర్సింహచారి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మార్కెట్‌లో గంజాయి కంటే హాష్ ఆయిల్‌కు డిమాండ్ ఎక్కువ ఉండడంతో ఇది విక్రయించి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. దీనిలో భాగంగా గుంటూరుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి వద్ద హాష్ ఆయిల్ కొనుగోలు చేసి ఇక్‌క భానుప్రకాష్‌కు విక్రయిస్తున్నాడు. గుంటూరు నుంచి తెప్పించుకున్న ఆయిల్‌ను తన డిజే కార్యాలయంలో పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు కోసం ఆసిఫ్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ ఎండి అబ్దుల్ జావీద్ తదితరులు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News