Home తాజా వార్తలు ఇద్దరు ఘరానా దొంగల అరెస్టు…

ఇద్దరు ఘరానా దొంగల అరెస్టు…

police

హైదరాబాద్: ఇళ్లల్లో దొంగతనం చేస్తున్న ఇద్దరు ఘరానా దొంగలను రాచకొండ సిసిఎస్, మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నాయకుడిని గతనెల 28వ తేదీన అరెసు చేశారు. వారి వద్ద నుంచి 42.6తులాల బంగారు ఆభరణాలు, 37తులాల వెండి వస్తువులు, ఐపాడ్, నికాన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ. 16,35,000 ఉంటుంది. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్,బోరబండకు చెందిన దొమ్మాట రాంప్రసాద్ అలియాస్ రాము ఫ్లవర్ వ్యాపారం చేస్తున్నాడు.

ఎంపి, కడప జిల్లా, చిన్న చౌక్, శబ్‌కరాపురానికి చెందిన బ్రహ్మోడు రాజయ్య అలియాస్ బ్రహ్మదేవర రాజశ్రీ గణేష్ అలియాస్ రాజు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చిత్తూరు జిల్లా తిరుపతి, త్రిచునూర్‌కు చెందిన టమాడ మోహనకృష్ణ వ్యాపారం చేస్తున్నాడు. ముగ్గురు వివిధ చోరీల కేసుల్లో జైలులో కలుసుకున్నారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించారు. అయితే, ఇళ్ళ వద్ద రెక్కి నిర్వహించే వీరు బీరు తాగి.. సిన్మాకు వెళ్లి… ఆ తర్వాత రాత్రి పూట దొంగతనానికి బయల్దేరుతారు. వీరిపై మేడిపల్లి, ఎల్‌బి నగర్, ఉప్పల్, ఆర్‌సి పురం పిఎస్‌ల్లో కేసులు నమోదయ్యాయి. రాజశ్రీ గణేష్‌ను 2014లో మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

ఇతడిపై 12కేసులు ఉండగా, నెల్లూరులో 2, చీరాలలో1, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9 కేసులు ఉన్నాయి. 2019లో ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసిన చోరీ కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు కలిసి చోరీలు చేయగా ప్రధాన రాంప్రసాద్‌ను పోలీసులు గత నెల 28వ తేదీన అరెస్టు చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారు. సమావేశంలో మల్కాజ్‌గిరి ఎసిపి జగన్నాథ్ రెడ్డి,ఇన్స్‌స్పెక్టర్లు లింగయ్య, మక్బుల్‌జానీ, కృష్ణమోహన్, ఎస్సైలు కృష్ణారావు, లింగయ్య, హెచ్‌సిలు బ్రహ్మం, నర్సింగ్ రావు,వెంకట్రాముడు, మనోహర్, నర్సింహులు,శివప్రసాద్, పూర్ణిమ పాల్గొన్నారు.

Two burglars held by Rachakonda Police