Home తాజా వార్తలు జెర్సీ ఆవుకు ఒకే కాన్పులో రెండు లేగదూడలు

జెర్సీ ఆవుకు ఒకే కాన్పులో రెండు లేగదూడలు

Jersey cow

వనపర్తి : గోపాల్‌పేట మండల పరిధిలోని చాకల్‌పల్లి గ్రామానికి చెందిన శేఖర్‌రెడ్డికి చెందిన జెర్సీ ఆవుకు ఒకే కాన్పులో రెండు దూడలు జన్మించడం జరిగిందని మండల పశువైద్యాధికారి డా. ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మన తెలంగాణతో మాట్లాడుతూ.. ఇలాంటి కాన్పుల పరిణామాలు చాలా అరుదుగా జరుగుతుంటాయన్నారు. ఆవుకు రెండుదూడలు జన్మించడం ఒకే సమయానికి రెండు అండాలు విడుదల అయిన వేళలో ఇలా జరుగుతుందన్నారు. ఒకే అండం రెండు భాగాలుగా విడిపోయినప్పుడు ఇలా జరుగుతుందని తెలిపారు. రైతు శేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Two calves born to Jersey cow