Home తాజా వార్తలు జంట పేలుళ్ల కేసు తీర్పు వెల్లడి…

జంట పేలుళ్ల కేసు తీర్పు వెల్లడి…

Two convicted in Hyderabad twin bomb blast case

Two convicted in Hyderabad twin bomb blast case

హైదరాబాద్: జంట పేలుళ్ల కేసులో నాంపల్లి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది. లుంబినీ పార్క్, గోకుల్‌చాట్‌ పేలుళ్లలో కోర్టు ఇద్దరిని దోషులుగా తేల్చింది. ఎ1 అక్బర్‌తో పాటు ఎ2 అనీఖ్‌ను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. వీరికి వచ్చే సోమవారం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. అలాగే సరియైన ఆధారాలు లేవంటూ మరో ఇద్దరిపై కోర్టు కేసు కొట్టివేసింది. 11 ఏళ్ల క్రితం 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌లో నిమిషాల వ్యవధిలో జంట పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుళల్లో 44 మంది చనిపోయారు. 68 మంది గాయపడ్డారు. మొదట లుంబినీ పార్కులో పేలుడు సంభవించింది. ఇక్కడ జరిగిన పేలుళ్లలో 12 మంది చనిపోయారు. 15 నిమిషాల తేడాతో కోఠిలోని గోకుల్‌చాట్‌లో పేలుడు సంభవించింది. ఇక్కడ జరిగిన పేలుడులో 32 మంది చనిపోయారు. ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ పాల్పడినట్టు విచారణ అధికారులు ధృవీకరించారు. ఈ రెండు పేలుళ్లపై మొదట సిట్ అధికారులు విచారణ చేపట్టారు. అనంతరం అక్టోపస్ ఈ కేసును విచారించింది. ఈ కేసులో కొందరు నిందితులు పరారీలో ఉండగా, ఐదుగురు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు.