Home ఖమ్మం బోనకల్‌లో రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

బోనకల్‌లో రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

ACCIDENTఖమ్మం : జిల్లా బోనకల్ మండలం కలకోట బ్రిడ్జి వద్ద పెద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్, బైక్‌కు ఢీ కొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో కలకోట గ్రామానికి చెందిన వెంగళ పుల్లయ్య (48), సిరిపురం గ్రామానికి చెందిన చావా కృష్ణాప్రసాద్ (24)గా గుర్తించారు. కలకోట గ్రామం నుంచి మధిర వైపు వెళ్తున్న వీరి ద్విచక్రవాహనాన్ని కలకోట బ్రిడ్జి మూల మలుపు వద్ద ట్రాక్టర్ ఢీ కొనడంతో వారిరువురు అక్కడిక్కడే మృతి చెందారు.