Home తాజా వార్తలు మునగాల శివారులో రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

మునగాల శివారులో రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

Two Died In Road Accident At Suryapetసూర్యాపేట: సూర్యాపేట జిల్లా మునగాల శివారులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. బైక్ పై వెళుతున్న ఫ్రాన్సిస్(56), ఎల్లమ్మ(53)లను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో వారు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మృతులు కోదాడ పరిధిలోని సాలర్జంగ్‌పేటకు చెందిన వారిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఫ్రాన్సిస్, ఎల్లమ్మల మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మునగాల పోలీసులు తెలిపారు.