Home తాజా వార్తలు రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

Road-Accident

మంచిర్యాల: జిల్లాలోని నస్పూర్ మండలం అరుణక్కనగర్ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. గుర్తు తెలియని వాహనం ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను నస్పూర్ మండలంలోని శ్యామ్‌నగర్ వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.