Home తాజా వార్తలు అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఆరుగురు కత్తులతో హల్ చల్

అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఆరుగురు కత్తులతో హల్ చల్

Attack

 

హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయి కోసం రెండు గ్యాంగ్‌లు కొట్టుకున్న సంఘటన టోలీ చౌకీలోని గుల్షన్ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. షాహెదా షారా అనే అమ్మాయిని మహ్మద్ మసూద్(23), అబ్దుల్ ఖరీమ్ షానవాజ్ (24), రెహ్మాన్, మహ్మాద్ హైమద్, మతీన్‌లు ప్రేమిస్తున్నారు. మతీన్ తమ ప్రేమకు అడ్డుగా వస్తున్నాడని అహ్మాద్ హైమద్ తన స్నేహితులతో కలిసి అతడిపై దాడికి దిగారు. దీంతో మతీన్ స్నేహితులు కత్తులతో ఘటనా స్థలానికి చేరుకొని హైమద్ గ్యాంగ్‌పై దాడి చేసి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Two Gangs Attack with Knife for Love in Hyderabad