కమాన్పూర్ : కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లిలో ఆశ్చర్యకర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇద్దరు యువతులు ప్రేమించుకొని వివాహానికి యత్నించిన ఘటన స్థానికంగా వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శిరీష, రామగిరి మండలం సెంటనరీ కాలనీకి చెందిన సింధు గత కొంత కాలంగా చనువుగా ఉంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇంట్లో వాళ్లు తమ పెళ్లికి అంగీకరించరేమో అనే నెపంతో ఇద్దరు అమ్మాయిలో పారిపోయిన హైదరాబాద్కు వచ్చారు. అక్కడ వివాహం చేసుకొనేందుకు ఓ తెలుగు టివి ఛానల్ను ఆశ్రయించారు. అయితే రెండు కుటుంబ సభ్యులను టివి ఛానల్ సిబ్బంది పిలిపించి వారి సమక్షంలో యువతులిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా ఈ నెల 5న శిరీష, సింధు ఇద్దరు కలిసి వారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీంతో రెండు కుటుంబాలు కమాన్పూర్, రామగిరి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదుపై విచారణ చేపట్టారు.
ఇద్దరమ్మాయిల ప్రేమాయణం.. పెళ్లికి యత్నం!
- Advertisement -
- Advertisement -