Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బంగారం వ్యాపారులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బంగారం వ్యాపారులు మృతి

Two Gold Traders Died In Road Accidentపెద్దపల్లి : ఎపిలోని గుంటూరుకు చెందిన ఇద్దరు బంగారు వ్యాపారులు తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఎపిలోని నరసరావుపేటకు చెందిన కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబు బంగారు వ్యాపారులు. తెలంగాణలోని బంగారు దుకాణాలకు వీరు బంగారాన్ని విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం వారు కారులో తెలంగాణకు వచ్చారు. రామగుండం రాజీవ్ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.  ఈ ప్రమాదంలో శ్రీనివాస్, రాంబాబు ఘటనాస్థలిలోనే చనిపోయారు.  కారులో ఉన్న సంతోష్ కుమార్, సంతోష్‌ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు వీరి వద్ద కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ కోటి రూపాయల విలువైన నగలను రామగుండం ఎస్ఐ శైలజకు 108 సిబ్బంది అప్పగించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాస్, రాంబాబు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శైలజ తెలిపారు.