Home అంతర్జాతీయ వార్తలు క్రిస్మస్ వేడుకల్లో తీరని విషాదం…

క్రిస్మస్ వేడుకల్లో తీరని విషాదం…

Road-Accident
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి

దుబాయ్: దుబాయ్‌లో క్రిస్మస్ దినం బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కేరళకు చెందిన ఈ ఇద్దరు విద్యార్థులు రోహిత్ క్రిష్ణకుమార్ (19), శరత్‌కుమార్ (21). క్రిస్మస్ వేడుకల నుంచి తిరిగి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. క్రిష్ణకుమార్ బ్రిటన్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. శరత్ కుమార్ అమెరికాలో యూనివర్శిటీలో చదువుతున్నాడు. యూనివర్శిటీ సెలవులు కారణంగా దుబాయ్ లోని కుటుంబంతో గడపడానికి వచ్చారు. వీరిద్దరూ దుబాయ్ ఢిల్లీ ప్రైవేట్ స్కూలులో చదువుకున్నారు.

Two Indian Students Killed in Road Accident in Dubai