Thursday, April 25, 2024

హ్యూస్టన్ మార్కెట్ కాల్పుల్లో ఇద్దరు మృతి, ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు: షెరీఫ్

- Advertisement -
- Advertisement -

Houston

హ్యూస్టన్: ” సందడిగా ఉన్న హ్యూస్టన్ సంత మార్కెట్‌లో ఆదివారం కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.  ముగ్గురు గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు” అని అధికారులు తెలిపారు. మార్కెట్లో ఐదుగురు వ్యక్తుల మధ్య వాగ్వాదం చెలరేగగా, రెండు తుపాకులు ఉపయోగించి కాల్పులు జరిపారు. అయితే అక్కడ ఉన్న అక్కడ ఉన్న అమాయక ప్రేక్షకులు  ఎవరూ గాయపడలేదు’’ అని హారిస్ కౌంటీ షెరీఫ్ ఎడ్ గొంజాలెజ్ తెలిపారు.

‘‘ఆసుపత్రి పాలైన వారిలో ఒకరు కాల్పులు జరిపిన వారిలోని మనిషేనని పరిశోధకులు భావిస్తున్నారు.  మరో ఇద్దరు అనుమానిత షూటర్లను కూడా సంఘటనా స్థలంలో అదుపులోకి తీసుకున్నారు” అని షెరీఫ్ డిప్యూటీ కెటిఆర్ కె-టివికి చెప్పారు.

హ్యూస్టన్ డౌన్‌టౌన్‌కు ఉత్తరాన 22 కిమీ. (14 మైళ్లు) దూరంలో ఉన్న మార్కెట్‌లో వేలాది మంది ప్రజలు షాపింగ్ చేస్తున్నప్పుడు  ఆదివారం దాదాపు మధ్యాహ్నం 1 గంటలకు షూటింగ్ ప్రారంభమైందని గొంజాలెజ్ ట్విట్టర్‌లో తెలిపారు.  కాల్పులకు పాల్పడిన వారు అనేక షాట్లు కాల్చారని,  డిప్యూటీలు  సంఘటన స్థలం నుండి రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారని షెరీఫ్  చెప్పారు. కాగా కాల్పులకు దారితీసిన దాని గురించి అధికారులు వెంటనే వివరాలు తెలుపలేదు, అయితే పాల్గొన్న వారందరూ ఒకరికొకరు తెలిసిన 20 ఏళ్ల వయస్సు గల పురుషులేనని ఆయన చెప్పారు.

న్యూయార్క్‌లోని బఫెలో సూపర్‌మార్కెట్‌లో తెల్లజాతికి చెందిన  18 ఏళ్ల యువకుడు 10 మందిని కాల్చి చంపిన మరుసటి రోజునే హ్యూస్టన్‌లో కాల్పులు జరిగాయన్నది ఇక్కడ గమనార్హం. కాగా ఇది వీలైనంత ఎక్కువ మంది నల్లజాతీయులను హతమార్చడానికి అధికారులు చేసిన ఊచకోతగా అభివర్ణిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News