Home జాతీయ వార్తలు రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

road-accident-image-doneతూర్పుగోదావరి : రాజమండ్రి ధవళేశ్వరం రహదారిలో ఉన్న రత్న ప్లాస్టిక్ పరిశ్రమ వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఆటోగూడ్స్, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.